మాఫియాపై సైబరాబాద్ పోలీస్ కొరడా  

– రూ.3.69 కోట్ల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం
– 154 మంది అరెస్ట్

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, మే 23: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది. ఎస్‌వోటీ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు శాంతిభద్రతల పోలీసులతో కలిసి ఏప్రిల్ 1 నుంచి మే 22 వరకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో  వివిధ‌ మత్తు పదార్థాలు భారీగా పట్టుబడ్డాయి. ఈ 50 రోజుల వ్యవధిలో ఎన్‌డీపీఎస్ చట్టం కింద మొత్తం 61 కేసులు నమోదు చేశారు. 154 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.3,69,21,200 విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌వోటీ డీసీపీ శోభన్ కుమార్ తెలిపారు. నిఘా వర్గాల సమాచారంతో సమన్వయంగా దాడులు నిర్వహించి డ్రగ్స్ ముఠాలను పట్టుకున్నామని వెల్లడించారు. సంప్రదాయ గంజాయి, హాష్ ఆయిల్‌తో పాటు కొత్తగా వస్తున్న సింథటిక్ డ్రగ్స్ ముప్పును అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. యువతను మత్తుకు బానిసలను చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం పౌరుల సహకారం అవసరమని, డ్రగ్స్ విక్రయాలు, రవాణాపై సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. సమాచారం కోసం శేరిలింగంపల్లి జోన్ ఇన్‌స్పెక్టర్ 8712680370, కూకట్‌పల్లి జోన్ ఇన్‌స్పెక్టర్ 8712663348, కుత్బుల్లాపూర్ జోన్ ఇన్‌స్పెక్టర్ 8712663660 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *