– కరువు సాయం కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13 : ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక సాయం కోరనున్నది. ఈమేరకు ఈనెల 15న దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లు భేటీ కానున్నారు. రాష్ట్రంలో వర్షపాతం లోటు, కరువు పరిస్థితులను వారు ప్రధానికి వివరించనున్నారు. వర్షాభావంతో సాగు, రైతులు, గ్రామీణ జీవనోపాధిపై పడుతున్న ప్రభావాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు కేంద్రం నుంచి తగిన నిధులు కోరనున్నారు. కరువు తీవ్రతను తగ్గించే చర్యల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంపై చర్చకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైతులు, గ్రామీణ కుటుంబాలకు సకాలంలో సాయం అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు కూడా తెలుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


