బిజెపి దీక్షలో మండిపడిన ఎంపి ఈటల రాజేందర్
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టో
సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన చిలుక పలుకులు మాట్లాడితే గౌరవం పోతుందని మంత్రి తుమ్మలను ఉద్దేశించి హితువుపలికారు. ప్రభుత్వం ఇస్తామన్న రూ.2 లక్షల రుణమాఫీ రైతుల అకౌంట్‌లో వేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తరహాలోనే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు బొంద పెడతారన్నారు. రెండు మూడు రోజుల్లో రింగ్ రోడ్డు వద్ద ధర్నా చేస్తామన్నారు. సాక్షాత్తు హైకోర్టు హైడ్రాపై మొట్టికాయలు వేసిందని.. అవి వేసింది హైడ్రాపై కాదు నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి వేసిందంటూ వ్యాఖ్యలు చేశారు.
కోర్టు వ్యాఖ్యలతోనైనా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న. ప్రజలు నీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు పైసలు ఎలా సంపాదించాలనే దానిపైనే ధ్యాస ఉందంటూ విమర్శలు గుప్పించారు. లిక్కర్ స్కామ్‌లు చేసి జైళ్లల్లోకి వెళ్లారన్నారు. కేసీఆర్ శకం ముగిసిందని.. కామెంట్స్ చేశారు. కేటీఆర్, కవితల మోసం చూసి ఎవ్వరూ కూడా వోటు వేయరన్నారు.