గురుకులాల్లో సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలి

స్టడీ సెంటర్లలో నాణ్యమైన శిక్షణ ఇవ్వాలి
అధికారుల‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు….
బీసీ సంక్షేమ శాఖ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆక్టోబ‌ర్ 1 : గురుకులాల్లో  అధికారులు, సిబ్బంది ప‌నితీరునుమెరుగుప‌రుచుకోవాల‌ని ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఆదేశించారు. మంగ‌ళ‌వావారం స‌చివాల‌యంలో  బీసీ సంక్షేమ శాఖ క్షేత్ర స్థాయిలో  అధికారుల పనితీరు, గురుకులాల్లో ఫలితాలు, సౌకర్యాలపై సమీక్ష స‌మావేశం జ‌రిగింది. ముఖ్యఅతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీసీ సంక్షేమ శాఖ కుటుంబం లాంటిది అధికారులు శాఖ గౌరవాన్ని పెంచాల‌న్నారు. ప్రతి జిల్లాలో క్షేత్ర స్థాయిలో అధికారులు గురుకులాల్లో సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాల‌ని సూచించారు. అదిలాబాద్ జిల్లాలో గురుకుల విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేయ‌క‌పోవ‌డంపై మంత్రి పొన్నం ఆగ్రహం వ్య‌క్తం చేశాఉరరు. అలాగే సూర్యాపేట, హనుమకొండ జిల్లా అధికారులను సైతం మంద‌లించారు.వారం రోజుల్లో కాటమయ్య రక్షణ కవచంపై శిక్షణ పూర్తి చేయాలన్నారు. ఈ నెల 7న బంజారా భవన్ లో జరిగే బీసీ సంక్షేమ శాఖ విస్తృత స్థాయి సమావేశంలో కింది స్థాయి అధికారి నుంచి ఉన్నతాధికారుల వరకు పాల్గొనాల‌ని ఆదేశిచంఆరు.

స్టడీ సర్కిల్ లో పనితీరు మెరుగుపరుచుకోవాల‌ని, బీసీ సంక్షేమ శాఖలో సమస్యలను పరిష్కరించుకుందామని అందుకు అధికారులు నిర్మాణాత్మక సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పారు. ఇప్పటికే విద్యా శాఖలో 19 వేల మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, 35 వేల మంది టీచ‌ర్ల‌కు బదిలీలు, 11 వేల మంది ఉపాధ్యాయ నియామకాలు చేపట్టింద‌ని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో కూడా రిక్రూట్ మెంట్‌ పూర్తయిందని పేర్కొన్నారు. స్టడీ సెంటర్ల ద్వారా నాణ్యమైన శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్ రాష్ట్రంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తుందని, అక్కడ గ్రూప్ 1 లో 137 మంది ప్రిలిమ్స్ లో కోచింగ్ తీసుకుంటే 96 మంది మెయిన్స్ కి ఎంపికయ్యారని, 574 మంది టీచర్ల కోసం శిక్షణ తీసుకుంటే 30 మందికి ఉద్యోగాలు వొచ్చాయని తెలిపారు. ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్ బృందాన్ని అభినందించారు. గద్వాల్ బీసీ స్టడీ సర్కిల్ పనితీరు బాగాలేదని మందలించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీలో మెయిన్స్ కి సెలెక్ట్ అయిన వారికి రూ.లక్ష సాయం అంద‌జేస్తున్నామ‌ని తెలిపారు.

ప్రతి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ  గురుకులాల‌ను విజిట్ చేయాల‌ని, బీసీ సంక్షేమ శాఖ.. ఇతర శాఖ‌ల‌కు రోల్ మోడల్ గా ఉండలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ విద్యా, వైద్య సంస్థలు, అంగన్ వాడీలలో ఈజీఎస్ ద్వారా పారిశుధ్య చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని మంత్రి సీతక్క వెల్లడించారని గుర్తుచేశారు.నవంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాలు సందర్శిస్తానని, పాఠశాల వాతావరణ బాగుండడం తో పాటు మొక్కల పెంపకం, పండ్లు మొక్కల పెంపకం  చేప‌ట్టాల‌ని సూచించారు. గత నెలలో పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాముకాటుతో చనిపోయారని.  అలాంటి ఘటనలు మ‌రోసారి జ‌ర‌గ‌కుండా చూడాల‌ని  అధికారులను ఆదేశించారు. ఏ సమస్య ఉన్నా జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకోవాలని సూచించారు. ప్రతీ గురుకులలో క్రీడలు, సాంస్కృతిక  కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.

మహాత్మా జ్యోతి రావు పూలే 294 గురుకులాలు ఉన్నాయని.  అందులో  వ్యవసాయ , లా కాలేజీలు ఉన్నాయి. గురుకులాల్లో ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న వాటికి స్థల పరిశీలన చేయాలని సూచించారు. అక్టోబర్ లో జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్, నవంబర్ లో రాష్ట్ర స్థాయి క్రీడలు డిసెంబర్ లో ఆర్ట్స్ అండ్ కల్చరల్ కార్నివాల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  హాస్టళ్ల‌లో 70,700 మంది ఉన్నారని, ముఖ్యంగా హైదరాబాద్ లో అధికంగా ఉన్నారని తెలిపారు. వికారాబాద్ లో గత పదో తరగతి పరీక్షల ఫ‌లితాలు బాగా లేకపోవడంతో మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న అధికారులను కొత్త జిల్లాలకు కూడా సర్దుబాటు చేయడంతో సిబ్బంది కొరత ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

కాట‌మ‌య్య ర‌క్ష‌ణ క‌వ‌చంపై శిక్ష‌ణ‌
కాగా వారంలోపు గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచంపై శిక్షణ పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 8,  9వ‌ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాటమయ్య రక్షణ కవచం పంపిణీ  పూర్తి చేయాలని సూచించారు. 7న‌ బంజారా భవన్ లో బీసీ సంక్షేమ శాఖ విస్తృత స్థాయి సమావేశంలో హాస్టల్ వార్డెన్ ,గురుకుల ప్రిన్సిపాళ్లు, డీబీసీవోస్, ఏబిడివో, ఆర్సివో , డీసీవోలు పాల్గొంటార‌ని తెలిపారు. ప్రధానమంత్రి యంగ్ అచీవ్ మెంట్ స్కాలర్ షిప్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని  సూచించారు. దీంతో మెరిట్ విద్యార్థులకు తెలంగాణ నుంచి 1001 మందికి  9, 10వ తరగతి చదివే వారికి రూ.75 వేలు, 11, 12 త‌ర‌గ‌తుల విద్యార్థుల‌కు రూ. 1.25 లక్ష‌ల  స్కాలర్ షిప్ అందిస్తున్నట్టు తెలిపారు.  సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, కమిషనర్ బాల మాయాదేవి, గురుకుల సెక్రటరీ  సైదులు, సీఈవో అలోక్ కుమార్, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్యబట్టు,  జాయింట్ డైరెక్టర్ సంధ్య, తిరుపతి, కార్పొరేషన్ ఎండీలు  చంద్రశేఖర్, ఇందిరా, శ్రీనివాస్ రెడ్డి , బీసీ సంక్షేమ శాఖ జిల్లా అభివృద్ధి అధికారులు, బీసీ సంక్షేమ శాఖ జిల్లా సహాయ అధికారులు , స్టడీ సర్కిల్ డైరెక్టర్లు, ఆర్సివో లు, డీసీవోలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *