– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 7ః బడ్జెట్ కేటాయింపుల్లేకుండా రాష్ట్రంలో విద్యావ్యవస్థను ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు యూనివర్సిటీల భూములను కాజేయడంపై ‘మిషన్ మోడ్’లో పనిచేస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఎక్స్ వేదికగా ఆరోపించారు. మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేటుపరం చేసేందుకు అటవీ సంపదను, జీవవైవిధ్యాన్ని లెక్కచేయకుండా ఆ భూమిని చదును చేసేందుకు ప్రయత్నించింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మొట్టికాయలు వేస్తే వెనక్కు తగ్గింది. ఇప్పుడు హైదరాబాద్, గచ్చిబౌలిలోని ప్రఖ్యాత మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములపై కన్నేసింది. యూనివర్సిటీలోని 50 ఎకరాలను వెనక్కు తీసుకుని మళ్లీ ప్రైవేటుకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. యూనివర్సిటీల వద్ద భూమి ఉంటే అది వర్సిటీల భవిష్యత్ అవసరాల కోసం, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ఉపయోగపడుతుంది. అంతే తప్ప ప్రభుత్వ ఖజానాను నింపేందుకు వీటిని వాడుకోవాల్సిన అవసరం లేదన్నారు. ల్యాండ్ బ్యాంక్ పెంచుకోవడం.. యూనివర్సిటీ భూములను ఆర్థిక దోపిడీకి వాడుకోవడంపైనే రేవంత్ రెడ్డి సర్కారు ఆసక్తి చూపిస్తోంది తప్ప రాష్ట్రంలో విద్యావ్యవస్థ, వర్సిటీల పురోగతిని మాత్రం అంధకారంలోకి నెట్టేస్తోందని ఘాటుగా విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





