– జగిత్యాలలో కేసీఆర్ సభపై మండిపడ్డ పీసీసీ చీఫ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: సీఎం రేవంత్ రెడ్డి రైతు సభకు పోటీగా కేసీఆర్ సభ పెట్టారని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రేవంత్ సభ 20 రోజుల ముందే ఖరారైందంటూ కేసీఆర్‌కు తమది కౌంటర్ సభ కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆశల పల్లకిలో ఊరేగించడం బీఆరఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు అలవాటేనన్నారు. జీవన్ రెడ్డికి కేసీఆర్ ఏం ఆశలు చూపించారో అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ అనే పులి ఫాం హౌస్‌కే పరిమితమైందని, పులి తిన్న ఆవుల గురించి బయటపెడతామని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను దగ్గర నుంచి చూస్తేనే జీవన్ రెడ్డికి ఆయన కథేమిటనేది అర్థమవుతుందన్నారు. జీవన్ రెడ్డి చేస్తున్న విమర్శలు ఆయన ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసినప్పుడు కనిపించ లేదా అని సూటిగా ప్రశ్నించారు. మేడిగడ్డలో కేసీఆర్ చేసిన మోసాలపై జీవన్ రెడ్డే తమకు పాఠాలు చెప్పారని ఈ సందర్భంగా మహేష్‌కుమార్ గుర్తు చేసుకున్నారు. అలాంటి జీవన్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి కోరస్ ఇస్తున్నాడని విమర్శించారు. గతంలో కేకే, డీఎస్‌లాగే జీవన్ కూడా బాధపడతారన్నారు. రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారని స్పష్టం చేశారు. రేవంత్ పోవాలి మార్పు రావాలి అనే హక్కు జీవన్ రెడ్డికి ఎక్కడిదంటూ మహేశ్ కుమార్ నిప్పులు చెరిగారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





