– భర్త మృతి, భార్య పరిస్థితి విషమం
మంచిర్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: మంచిర్యాలలో దారుణం చోటుచేసుకుంది. అప్పు ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి దంపతులపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో భర్త చనిపోగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన శంకరయ్య దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఓ వ్యక్తి దుకాణం దగ్గరకు వచ్చాడు. రూ.100లు అప్పు ఇవ్వమని అడగగా శంకరయ్య ఒప్పుకోలేదు. దీంతో ఆ వ్యక్తి గొడవకు దిగాడు. గొడవ చిలికిచిలికి గాలివానలా మారగా విచక్షణ కోల్పోయిన ఆ వ్యక్తి శంకరయ్యపై కత్తితో దాడి చేశాడు. అడ్డం వచ్చిన అతని భార్యపై కూడా దాడి చేశాడు. దాడి అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ శంకరయ్య దంపతులను స్థానికులు హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శంకరయ్య ప్రాణాలు విడిచాడు. ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు హాస్పిటల్‌కు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


