హామీల అమలులో కమిటీలదే కీలక పాత్ర

– స్పీకర్‌ ‌ప్రసాద్‌ ‌కుమార్‌
‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 28:పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ హామీల అమలు కమిటీల పాత్ర చాలా గొప్పదని శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ అన్నారు. శాసనసభ సమావేశాల సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన హాలను అమలు చేసే విదంగా చూడాల్సిన బాధ్యత హాల కమిటీదని అన్నారు.  ఆవిధంగా పనిచేయాలని సూచిస్తున్నాను. నియామాల కమిటీ శాసనసభ సక్రమమైన, సమర్ధవంతమైన ,ప్రజాస్వామ్య బద్ధమైన నిర్వాహణలో అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుందన్నారు. శాసనసభ భవనంలోని స్పీకర్‌ ‌ఛాంబర్‌ ‌లో  మంగళవారం శాసనసభ ప్రభుత్వ హాల అమలు కమిటీ, శాసనసభ యొక్క నియమాల కమిటీ , శాసనసభ యొక్క నైతిక విలువల కమిటీల ప్రారంభ సమావేశం జరిగింది. శాసన సభాపతిగడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌, ‌శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌ ‌బాబు, శాసనసభ హాల అమలు కమిటీ చైర్మన్‌ ‌పటోళ్ల సంజీవరెడ్డి, సభ్యులు జె. అనిరుధ్‌ ‌రెడ్డి, జారే ఆదినారాయణలు హాజరయ్యారు. రూల్స్ ‌కమిటీ సమావేశానికి  కమిటీ సభ్యులు దానం నాగేందర్‌, ‌తూడి మెఘారెడ్డి, భూక్యా మురళి నాయక్‌, ‌హాజరయ్యారు. శాసనసభ నైతిక విలువల కమిటీ చైర్మన్‌ ‌రేవూరి ప్రకాష్‌ ‌రెడ్డి  అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు జి. మధుసూదన్‌ ‌రెడ్డి ,కౌన్సిల్‌ ‌సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు, అసెంబ్లీ సెక్రటరీ రేండ్ల తిరుపతి పాల్గొన్నారు. శాసనసభ చట్టాల ద్వారానే కాకుండా ఆ చట్టాలను రూపొందించే సభ్యుల ప్రవర్తన, నిబద్ధత మరియు వ్యవహార శైలి ద్వారా కూడా అంచనా వేయబడుతుందని స్పీకర్‌ అన్నారు. ప్రజల విశ్వాసాన్ని పరిరక్షించడం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల నమ్మకాన్ని బలోపేతం చేయడం అనే ఉద్యేశ్యంతోనే ప్రపంచ వ్యాప్తంగా పార్లమెంటరీ వ్యవస్థలో నైతిక విలువల కమిటీ అనే వ్యవస్థ అభివృద్ధి చెందింది. రాగద్వేషాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా కమిటీలు పనిచేయాలి. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్‌ ‌బాబు మాట్లాడుతూ…శాసనసభలో సభ్యులకు మొదటిగా ఇచ్చేది రూల్స్ ‌బుక్‌, ‌దానికి అనుగుణంగా స్పీకర్‌ ‌శాసనసభను నడుపుతారని అన్నారు. గత ప్రభుత్వంలో రూల్స్ ‌బుక్‌ ‌ను మార్చివేశారు. శాసనసభను సమర్ధవంతంగా నడపడానికి కమిటీ అధ్యక్షులు, సభ్యులు కలిసి నూతన నిబంధనలతో రూల్స్ ‌బుక్‌ ‌ను రూపొందించాలి. శాసనసభ కమిటీలు ఇతర రాష్టాల్రలో కూడా స్టడీ టూర్‌ ‌చేసి ఆయా రాష్టాల్ర శాసనసభలలో అమలవుతున్న నిబంధనలను పరిశీలించాలి, వారి సలహాలు తీసుకోవాలని నా సూచన అని అన్నారు. సభలో నియమాలను  పాటించే విదంగా చూడడంతో పాటుగా, సభ హుందాతనాన్ని కాపాడడంలో విలువల కమిటీది కీలక పాత్ర అన్నారు. కమిటీ నిర్ణయాలు పారదర్శకంగా ఉంటూ తెలంగాణ రాష్ట్రం ఒక రోల్‌ ‌మోడల్‌ ‌గా ఉండే విదంగా ఎథిక్స్ ‌కమిటీ సూచనలు ఉండాలన్నారు. కమిటీల చైర్మన్లు మాట్లాడుతూ… శాసనసభ మాపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తూ సభ గౌరవాన్ని పెంచుతామని తెలిపారు.
—————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *