– బీఆర్ఎస్‌కు మంత్రి అడ్లూరి సవాల్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనకు సంబంధించి బీఆరఎస్ చార్జ్‌షీట్‌పై మంత్రి అడ్లూరి లక్క్ష్మణ్ స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వెయ్యి రోజుల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి లిస్టును మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులకు వాట్సాప్‌లో పంపిస్తున్నట్లు చెప్పారు. చార్జ్‌షీట్ కాదు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. బీఆరఎస్ చార్జ్‌షీట్‌లో అబద్దాలు మాత్రమే ఉన్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను హరీష్‌రావు, కేటీఆర్, కేసీఆర్‌కు రిపోర్టు పంపిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వెయ్యి రోజుల పాలనపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను అమలు చేస్తూనే కొత్త పథకాలు కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. ’మాకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. అప్ప్పుడే కేటీఆర్‌కు తొందర ఎందుకు’ అని ప్రశ్నించారు. బీఆరఎస్ 2014`18 మేనిఫెస్టో, కాంగ్రెస్ 2023 మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా అంటూ ’విÖ పదేళ్ల పాలన, మా రెండున్నరేళ్ల పాలనపై దమ్ముంటే చర్చకు రండి’ అంటూ మంత్రి అడ్లూరి సవాల్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





