నేపాల్‌లో మళ్లీ వర్షాలు

– ఉప్పొంగుతున్న మూడు ప్రధాన నదులు

ఖాట్మాండ్, సెప్టెంబర్ 2 : నేపాల్‌కు మరోసారి వరద ముప్పు  పొంచి ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా మూడు ప్రధాన నదులలో నీటి మట్టాలు డేంజర్ మార్క్‌ను దాటాయి. నేపాల్ వరద అంచనా విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 6 గంటల సమయంలో సున్ కోషి, బుధి గండకి, మహాకాళి నదులలో నీటి మట్టాలు హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. దీంతో మధ్య, పశ్చిమ, తూర్పు ప్రాంతాల ప్రజలకు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. లామ్‌జంగ్ జిల్లాలోని మార్శ్యాంగ్డి నదిలో కూడా నీటి మట్టం మంగళవారం అర్ధరాత్రి డేంజర్ మార్క్ దాటిందని అధికారులు వెల్లడించారు. ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ సూచించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరంతరం వర్షాలు కురుస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. బుధవారం నాటికి నేపాల్, టిబెట్‌లలో కలిపి మరణాల సంఖ్య 1,130కి పెరిగింది. ఇప్పటివరకు 1,113 మృతదేహాలకు పోస్టుమార్టం, చట్టపరమైన గుర్తింపు పక్రియలు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. 95 మృతదేహాలను బంధువులకు అప్పగించామన్నారు. గుర్తింపు లేని 911 మృతదేహాల వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశామన్నారు. ఇప్పటివరకు 6,541 మందిని రక్షించగా 4,858 మంది గల్లంతయ్యారు. 7,912 మంది సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *