– చరిత్ర సృష్టించిన సంక్షేమ గురుకులాలు
– 99.12% రికార్డుతో కార్పొరేట్ సంస్థలను అధిగమించిన విద్యార్థులు
– సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు విద్యారంగంలో మరో అద్భుతాన్ని ఆవిష్కరించాయి. 2026 పదవ తరగతి ఫలితాల్లో ఏకంగా 99.12 శాతం ఉత్తీర్ణత సాధించి చరిత్ర సృష్టించాయి. “ప్రతిపక్షాల విమర్శలు కాదు, మా విద్యార్థులు సాధించిన విజయలే మా ప్రభుత్వ పనితీరుకు గీటురాయి” అని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గురుకుల విద్యాసంస్థలు నూతన దిశగా అడుగులు వేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. 2026 పదవ తరగతి ఫలితాల్లో ఏకంగా 99.12 శాతం ఉత్తీర్ణత సాధించి చరిత్ర సృష్టించాయి. “ప్రతిపక్షాల విమర్శలు కాదు, మా విద్యార్థులు సాధించిన విజయలే మా ప్రభుత్వ పనితీరుకు గీటురాయి” అని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గురుకుల విద్యాసంస్థలు నూతన దిశగా అడుగులు వేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. గురువారం డి.ఎస్.ఎస్. భవన్లో జరిగిన సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫలితాలను వెల్లడించారు. 40 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా 99.12 శాతం ఉత్తీర్ణత నమోదు కావడం వెనుక ప్రభుత్వ వ్యూహాత్మక సంస్కరణలు ఉన్నాయని ఆయన తెలిపారు. పదవ తరగతి 17,071 మంది పరీక్ష రాయగా, 16,921 మంది ఉత్తీర్ణులయ్యారు.
100% ఉత్తీర్ణత: 235 పాఠశాలల్లో 163 పాఠశాలలు 100 శాతం ఫలితాలను సాధించాయి. తొమ్మిది జిల్లాల్లోని అన్ని గురుకులాలు వంద శాతం ఉత్తీర్ణతతో సత్తా చాటాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.22%, ప్రథమ సంవత్సరంలో 77.79% ఉత్తీర్ణత నమోదైంది. జేఈఈ మెయిన్స్లో 441 మంది అర్హత సాధించగా, 35 మంది 90 పర్సెంటైల్ పైగా స్కోర్ చేశారు. ఐఐటీ, నీట్ లోనూ గురుకుల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. ఈ అద్భుత విజయాల వెనుక ‘స్టూడెంట్ సెంట్రిక్’ విధానం ఉందని మంత్రి వెల్లడించారు. ఒక్క విద్యార్థి కూడా వెనుకబ డకూడదు అనే లక్ష్యంతో ట్రాకింగ్ వ్యవస్థను, రోజువారీ బోధనతోపాటు సాయంత్రం డౌట్ క్లారి ఫికేషన్ సెషన్లను అమలు చేశామన్నారు. టీచర్లు విద్యార్థులను తమ సొంత పిల్లలుగా భావించి, 24 గంటలు అందుబాటులో ఉండి బోధించడం వల్లనే ఇది సాధ్యమైందని ఆయన ప్రశంసించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




