హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 30 : తెలంగాణలో మార్పు కోసం ప్రజలు వేసిన వోటు చరిత్రను తిరగరాసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరు జిల్లాలో రైతు పండుగ బహిరంగ సభకు ఆయన బయలుదేరారు. ఈసందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు… పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు… పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం వోటేశాడు. ఆ వోటు అభయహస్తమై… రైతన్న చరిత్రను తిరగరాసింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ… రూ.7,625 కోట్ల రైతు భరోసా… ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్… రూ.10,444 కోట్ల ఉచిత విద్యుత్… రూ.1433 కోట్ల రైతుబీమా… రూ.95 కోట్ల పంట నష్ట పరిహారం… రూ.10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు… ఒక్క ఏడాదిలో … 54 వేల కోట్ల రూపాయలతో… రైతుల జీవితాల్లో పండగ తెచ్చాం. ఇది నెంబర్ కాదు… రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం. ఈ సంతోష సమయంలో… అన్నదాతలతో కలిసి… రైతు పండుగలో పాలు పంచుకోవడానికి… ఉమ్మడి పాలమూరుకు వొస్తున్నా.అని ‘ఎక్స్’ వేదిక గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.