- దేశం మొత్తం నియోజకవర్గం వైపు చూసేలా అభివృద్ధి
- విద్యా హబ్‌గా లగచర్ల.. 6 నెలల్లో సిమెంట్ పరిశ్రమలు
- ఏడాదిన్నరలోపు ‘కొడంగల్-నారాయణపేట’ ఎత్తిపోతల పూర్తి
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- కొడంగల్‌లో 430 పడకల హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన
- మహలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం
కొడంగల్,ప్రజాతంత్ర, మే 8: “దేశం మొత్తం కొడంగల్ వైపు చూసేలా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి (Kodangal Development) చేస్తామని, కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామని, అందరి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడుపుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, దౌల్తాబాద్ వేంకటేశ్వర ఆలయం, కోస్గి వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం ఉద్వేగభరితంగా ప్రసంగించారు.
దేశం మొత్తం కొడంగల్ వైపు చూసేలా అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పేదల సంక్షేమం కోసం తాము పనిచేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. శుక్రవారం వికారాబాద్ జిల్లాలోని సొంత నియోజకవర్గం కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. 430 పడకల హాస్పిట) నిర్మాణం, దౌల్తాబాద్ వేంకటేశ్వర ఆలయం, కోస్గి వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. పేదల తిరుపతిగా పేరుగాంచిన కొడంగల్ శ్రీ మహలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం చేయటం అదృష్టమని చెప్పుకొచ్చారు. తెలంగాణ పేదల తిరుపతిగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఓవైపు గుడి.. మరోవైపు గడి ఏకమైన ఈ నియోజకవర్గాన్ని నందనవనంగా మార్చటానికి అందరు కలిసి రావటం అభినందనీయమని తెలిపారు. ఆగమశాస్త్ర పండితుడు సుందరవరదాచార్యులు కలలుగన్న గుడి నిర్మాణం సహకారం కావటం సంతోషమని చెప్పారు. తిరుపతిలో ఏ రకమైన పూజలు జరుగుతాయో ఇక్కడ అలాగే పూజలు జరుగుతాయని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ గుడికి కర్ణాటక, మహరాష్ట్ర నుంచి భక్తులు వస్తారని.. దీంతో కొడంగల్‌కు దేశంలో గుర్తింపు వస్తోందని తెలిపారు. కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి భూసేకరణ పూర్తయిందని తెలిపారు ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధుల కొరత లేదన్నారు. ఈ ఎత్తిపోతల పథకానికి భూసేకరణ పూర్తయిందని.. అనుమతులు వచ్చాయని, ఏడాదిన్నరలోపు పూర్తి చేద్దామని చెప్పుకొచ్చారు.
కృష్ణానదీ జలాలతో కొడంగల్ భూములు తడవాలన్నారు. కృష్ణా జలాలు ఇక్కడికి వచ్చే వరకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి శ్రీహరిని నిద్ర పోనీయొద్దని స్థానిక నేతలకు సూచించారు. కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మంత్రి పదవి దక్కలేదని, ఇప్పుడు కొడంగల్ ఎమ్మెల్యేనైన తనకు సీఎం పదవి దక్కిందన్నారు. కొడంగల్ నుంచే దౌల్తాబాద్, కోస్గి ఆలయాల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.కృష్ణ- వికారాబాద్ రైల్వేలైన్ త్వరలో పూర్తవుతుందని స్పష్టం చేశారు. రేకులపాడు ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమలను ఆరు నెలల్లో ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని అన్నారు. 20 ఎకరాల్లో లగచర్ల వద్ద విద్యాహబ్‌గా మార్చుతున్నామని సీఎం ఉద్ఘాటించారు. ఇక్కడ అనేక విద్యాసంస్దలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో ఉండాలని.. ఆ తర్వాత అందరం కలిసి పనిచేయాలని సూచించారు. 2034 వరకు గుంపులు, గ్రూపులు పక్కన పెట్టాలని.. అభివృద్ధికి బాటలు వేద్దామని పిలుపునిచ్చారు. కొడంగల్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకుందామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.





