– డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞా కార్యక్రమానికి ఆహ్వానం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : జూన్ 12వ తేదీన పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా పొగాకు, మద్యం, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌కు తెలిపారు. పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు కిట్లు అందజేస్తామన్నారు. లోక్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం భేటీ అయి ప్రతిజ్ఞ, కిట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు. కిట్లలో యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, క్రీడా దుస్తులు, విద్యార్థులకు అవసరమైన ఇతర సామగ్రి ఉంటాయని వివరించారు. తమ పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులు డ్రగ్స్, ఇతర వ్యసనాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉంచేలా యాజమాన్యాలు ప్రకటిస్తాయని గవర్నర్‌కు తెలియజేశారు. పాఠశాల విద్యాశాఖ, పోలీసు శాఖ, ఈగల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ప్రతిజ్ఞ, ఇతర కార్యక్రమాలు ఉంటాయన్నారు. విద్యా సంస్థలను సురక్షితం, డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యాజమాన్యాల సమష్టి బాధ్యతపై అవగాహన కల్పించడం కార్యక్రమం ప్రధాన లక్ష్యమని గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ముఖ్యమంత్రి వివరించారు. కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ పరిశీలనార్ధం ముందుగానే పంపుతామని గవర్నర్‌కు ముఖ్యమంత్రి చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





