– తలుపులు పగులగొట్టి 6 తులాల బంగారం చోరీ
చేర్యాల, ప్రజాతంత్ర, మే 11 :చేర్యాల పట్టణంలో పట్టపగలు దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా ఎంచుకొని పట్టపగలే దోపిడీకి పాల్పడుతూ ప్రజలను భయాం దోళనకు గురిచేస్తున్నారు. పట్టణ ంలోని గడితోట కాలనీలో సోమ వారం మధ్యాహ్నం తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చొరబడి ఆరు తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ. 50 వేల నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గడితోట కాలనీకి చెందిన పిట్టల శ్రీనివాస్ అనే రైతు సోమవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు, ఇదే అదునుగా భావించి ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాలో భద్రపరిచిన 6 తులాల బంగారం, రూ.50 వేల నగదును అపహరించుకుపోయారు. ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన శ్రీనివాస్, తలుపులు పగులగొట్టి ఉండటాన్ని చూసి షాక్కు గురయ్యారు. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని సొమ్ము మాయం కావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేర్యాల ఎస్పై గూడ అపూర్వ రెడ్డి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ నిపుణులు ఆధారాలను సేకరించారు. బాధితుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



