బోస్టన్‌ ‌కోర్టు తీర్పును సవాల్‌ ‌చేయనున్న న్యాయ శాఖ

– హెచ్‌-1‌బీ వీసా ఫీజు పెంపు వ్యవహారంలో

వాషింగ్టన్‌,‌ జూన్‌ 12: ‌హెచ్‌-1‌బీ వీసా ఫీజు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ అస్సలు వెనక్కి తగ్గేది లేదని తేల్చారు.  వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్‌ ‌యంత్రాంగం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికాలోని బోస్టన్‌ ‌ఫెడరల్‌ ‌కోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్‌ ‌చేసేందుకు అమెరికా న్యాయశాఖ చర్యలు చేపట్టింది. హెచ్‌-1‌బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు  పెంచుతూ గతేడాది సెప్టెంబరులో ట్రంప్‌ ‌తీసుకొన్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, దీన్ని యూఎస్‌ ‌ఛాంబర్‌ ఆఫ్‌ ‌కామర్స్‌తో సహా పలు డెమోక్రటిక్‌ ‌నేతలు ఉన్న రాష్టాల్రు కోర్టులో సవాల్‌ ‌చేశాయి. ఈ క్రమంలో బోస్టన్‌లోని ఫెడరల్‌ ‌కోర్టు ట్రంప్‌ ‌నిర్ణయం చట్టవిరుద్ధమైనదని ప్రకటించింది. దీంతో పలు కంపెనీలకు ఊరట లభించనట్లయ్యింది. ఈ నేపథ్యంలోనే ఫెడరల్‌ ‌కోర్టు తీర్పును అప్పీల్‌ ‌చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ అమెరికా న్యాయశాఖ నోటీసు దాఖలు చేసింది. ట్రంప్‌ ‌యంత్రాంగం తాజా చర్యలతో ఈ అంశం మరికొన్ని నెలల పాటు న్యాయస్థానాల్లో మగ్గనుంది. దీంతో ఫీజు భారం నుంచి కంపెనీలకు పూర్తి మినహాయింపు దక్కనట్లేని భావిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *