ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌ప్రయాణిస్తున్న రైలుపై రాళ్లు

– ఇద్దరు నిందితుల అరెస్ట్ ‌

న్యూదిల్లీ, జూన్‌ 12: ‌రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) అధినేత మోహన్‌ ‌భాగవత్‌ ‌ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం రాత్రి మోహన్‌ ‌భాగవత్‌ ‌కాన్పూర్‌ ‌నుంచి దిల్లీకి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ‌రైలులో ప్రయాణించారు. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ ‌స్టేషన్ ‌సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ రైలుపై రాళ్లు విసిరారు. దీంతో ఏసీ ఫస్ట్ ‌క్లాస్‌ ‌కోచ్‌లోని ఓ కిటికీ దెబ్బతింది. భాగవత్‌  కూడా ఇదే కోచ్‌లో ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు ధ్రువీకరించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా ముగ్గురు వ్యక్తులు కావాలనే రాళ్ల దాడికి పాల్పడినట్లు యూపీ పోలీసులు గుర్తించారు. ఆ ముగ్గురిలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు, మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *