రేవంత్‌ను కలిసి చెక్కు అందించిన చిరంజీవి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్16 : వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు సాయం అందజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖ నటుడు చిరంజీవి రూ.50 లక్షల విరాళం ఇచ్చారు. రామ్ చరణ్ తరఫున మరో రూ.50 లక్షల చెక్కులను సీఎం రేవంత్‌కు అందజేశారు.
అలాగే అమర్‌రాజా గ్రూప్ తరఫున సీఎం సహాయనిధికి మాజీమంత్రి గల్లా అరుణ కుమారి రూ.కోటి విరాళం, సినీ నటులు అలీ రూ.3 లక్షలు, విశ్వక్ సేన్ రూ.10 లక్షలు అందజేశారు. సినీ నటుడు సాయిధరమ్ తేజ్ రూ.10 లక్షలు, గరుడపల్లి ఇన్‌ఫ్రాస్టక్చర్ర్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ సంజయ్ గరుడపల్లి రూ.25 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు.