పలు అంతర్జాతీయ సర్వీసుల నిలిపివేత

–  ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం

న్యూదిల్లీ, మే 13 : ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇంధన ధరల పెరుగుదల, గగనతల ఆంక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మొత్తం ఆరు ప్రధాన అంతర్జాతీయ మార్గాల్లో విమానాలను నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటన జారీ చేసింది. దిల్లీ`చికాగో, ముంబై`న్యూయార్క్, దిల్లీ`షాంఘై, చెన్నై`సింగపూర్, ముంబై`ఢాకా, దిల్లీ`మాలే రూట్లలో సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయం జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో అమలులో ఉంటుందని తెలిపింది. నష్టాల దృష్ట్యా ఇప్పటికే కొన్ని మార్గాల్లో సర్వీసులను ఎయిర్ ఇండియా తగ్గించింది. ఆ నిర్ణయాన్ని మరికొన్ని రూట్లకు విస్తరిస్తూ తాజాగా ప్రకటన జారీ చేసింది. దీని ప్రకారం ఎయిర్ ఇండియా సంస్థ ప్రతి నెలా 1,200కు పైగా అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపనుంది. వీటిలో ఉత్తర అమెరికాకు వారానికి 33, ఐరోపాకు 47, యÖకేకు 57, ఆస్టేల్రియాకు 8, ఫార్ ఈస్ట్, ఆగ్నేయాసియా, సార్క్ ప్రాంతాలకు 158 విమానాల చొప్ప్పున నడుస్తాయి. అలాగే మారిషస్‌కు వారానికి ఏడు విమాన సర్వీసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, నష్టాల దృష్ట్యానే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *