Category తెలంగాణ

కుటుంబ సర్వేలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి..

వివరాలు నమోదు చేసిన అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 28 : ‌సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తన కుటుంబ వివరాలను నమోదు చేయించుకున్నారు. ఎన్యుమరేటర్‌, అధికారులు.. సీఎం రేవంత్‌ ‌చెప్పిన కుటుంబ వివరాలను నమోదు చేశారు. హైదరాబాద్‌ ‌కలెక్టర్‌ అనుదీప్‌, ‌జీహెచ్‌ఎం‌సీ కమిషనర్‌ ఇలంబర్తి,…

రూ.200 కోట్లతో ‘బన్యన్‌ ‌నేషన్‌’ ‌కంపెనీ భారీ విస్తరణ

మరో 500 మందికి కొత్తగా ఉద్యోగాలు మంత్రి శ్రీధర్‌ ‌బాబు పెట్టుబడితో భారీ విస్తరణ చేపట్టేందుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు వెల్లడించారు. సచివాలయంలో గురువారం సంస్థ ప్రతినిధులతో సమవేశం అనంతరం ఆయన వివరాలు తెలిపారు. ప్రస్తుతం పటాన్‌ ‌చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో 15 వేల టన్నుల వార్షిక…

గురుకులాల్లో ఆహార భద్రతకు ఫుడ్‌ ‌సేఫ్టీ కమిటీలు

ఫుడ్‌పాయిజన్‌పై టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 28 : ‌రాష్ట్రంలోని గురుకులాలు, వసతిగృహాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఫుడ్‌ ‌పాయిజన్‌ ‌ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టళ్ల, ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్‌ ‌సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఫుడ్‌…

రాష్ట్రంలో ఖేలో ఇండియా..!

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 28 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా -2026 పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వొచ్చే ఏడాది నిర్వహించేలా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయగా, 2025లో బిహార్‌లో నిర్వహించేలా ఇప్పటికే నిర్ణయం జరగడంతో 2026లో హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ సింగ్‌ మాండవీయ సానుకూలంగా స్పందించి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డికి హామీ ఇచ్చారు. రాతపూర్వక విజ్ఞప్తిని జితేందర్‌రెడ్డి గురువారం కేంద్ర మంత్రికి అందజేసి వివరించగా, ఈమేరకు స్పష్టత లభించింది. జాతీయ స్థాయి క్రీడల నిర్వహణకు అన్నిసౌకర్యాలు హైదరాబాద్‌ నగరంలో 32వ జాతీయ క్రీడలు (2002లో), ఆఫ్రో ఆషియన్‌ గేమ్స్‌, 7వ మిలిటరీ గేమ్స్‌ సహా అనేక జాతీయ స్థాయి పోటీలు జరిగాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ లేఖలో ప్రస్తావించారు. క్రీడా రంగానికి గత పదేండ్ల పాలనతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యనిస్తున్నదని, జాతీయ స్థాయి పోటీలను నిర్వహించడానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని ఆ లేఖలో సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్సుల అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇండోర్‌ స్టేడియం, స్విమ్మింగ్‌ పూల్‌, సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌, హాకీ టర్ఫ్‌, షూటింగ్‌ రేంజ్‌, సరూర్‌నగర్‌లో మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియం (ఎయిర్‌ కండిషన్డ్‌), సింథటిక్‌ టెన్నిస్‌ కోర్ట్‌, స్కేటింగ్‌ ట్రాక్‌, ఔట్‌ డోర్‌ స్టేడియం, ఎల్బీ స్టేడియంలో ఇండోర్‌ స్టేడియంతో పాటు టెన్నక్‌ కాంప్లెక్స్‌, ఫుట్‌ బాల్‌ గ్రౌండ్‌, కేవీబీఆర్‌ ఇండోర్‌ స్టేడియం, హుస్సేన్‌ సాగర్‌లో వాటర్‌ స్పోర్ట్స్‌ నిర్వహించే సౌకర్యం, ఉస్మానియా క్యాంపస్‌లో సైక్లింగ్‌ వెల్‌డ్రోమ్‌, సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌, స్విమ్మింగ్‌ పూల్‌, స్కేటింగ్‌ ట్రాక్‌, జింఖానా-2 గ్రౌండ్‌లో ఫుట్‌ బాల్‌ గ్రౌండ్‌తో పాటు ఔట్‌ డోర్‌ గేమ్స్‌ నిర్వహించే వసతులు ఉన్నాయని ఆ లేఖలో సీఎం రేవంత్‌ గుర్తుచేశారు. క్రీడాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తూ ఏటా ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌, వింటర్‌ గేమ్స్‌, పారా గేమ్స్‌, యూనివర్శిటీ గేమ్స్‌ ను 2018 నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తోందని సీఎం రేవంత్‌ గుర్తుచేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం పది రెట్ల మేర క్రీడల కోసం కేటాయించిందని సీఎం రేవంత్‌ గుర్తుచేశారు. కేవలం క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా క్రీడాకారులు చేరుకునేలా రైలు, విమాన సౌకర్యాలు కూడా ఉన్నాయని, పేరెన్నికగన్న స్టార్‌ హోటళ్ళు, ఇతర వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం మాత్రమే కాకుండా యువతను ప్రోత్సహించేలా ప్రత్యేక పాలసీని కూడా రూపొందిస్తున్నదని, ఆ శాఖను స్వయంగా ముఖ్యమంత్రే నిర్వహిస్తున్నట్లు కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ విజ్ఞప్తిని కేంద్ర మంత్రికి వివరించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌ రెడ్డి.... అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి క్రీడారంగంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వొచ్చేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆర్థికంగా మాత్రమే కాక అనేక రంగాల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేక గుర్తింపు సాధించిందని, ఇకపైన క్రీడా పోటీల నిర్వహణతో పాటు భవిష్యత్తులో ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన అవగాహనతో ఉన్నదని జితేందర్‌ రెడ్డి గుర్తుచేశారు. కేంద్ర మంత్రితో జరిగిన ఈ సమావేశంలో జితేందర్‌ రెడ్డితో పాటు ఎంపీలు డాక్టర్‌ మల్లు రవి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రామసహాయం రఘురామ్‌రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.

గేమ్స్‌కు వేదికగా హైదరాబాద్‌! 2026లో నిర్వహించేందుకు కేంద్రం సుముఖత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 28 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా -2026 పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వొచ్చే ఏడాది నిర్వహించేలా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయగా,  2025లో బిహార్‌లో నిర్వహించేలా ఇప్పటికే నిర్ణయం జరగడంతో 2026లో…

పేదలకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం

Indiramma's government stands with the poor

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్‌ 28 : ‌తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోందని   రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనవాసరెడ్డి అన్నారు. కూసుమంచి మండల పర్యటనలో భాగంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ..  – మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలు గెలిపించారని,  గత…

రాష్ట్రంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల తొల‌గింపున‌కు కుట్ర‌

mla harees rao fire on congress govt

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు హైద‌రాబాద్ ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 28 : రాష్ట్ర వ్యాప్తంగా 6,200 పాఠశాలలను మూసివేసేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుట్ర చేస్తోంద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ప్రతీ చిన్న గ్రామానికి ప్రైమరీ స్కూల్, ప్రతీ రెవెన్యూ గ్రామానికి అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఏర్పాటు చేస్తామని…

సింగూరు, మంజీరాలకు గోదావరి జలాలు

Godavari waters to Singur and Manjeera

మహానగరానికి తాగునీటితో పాటు సేద్యంలోకి  కొత్త ఆయకట్టు అదే తరహాలో నిజాంసాగర్ కు గోదావరి జలాలు సింగూరు ప్రాజెక్ట్‌లో పూడిక తీతకు సన్నద్ధం పూడిక తీతతో మహనగరానికి స‌మృద్ధిగా తాగునీరు.. కాలువల లైనింగ్ కు టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టండి మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా నీటిపారుదల ప్రాజెక్ట్‌లు,…

రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం సర్వే పూర్తి

29,82,034 నివాసాల సమాచరం కంప్యూటరీకరణ పూర్తి హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్27: సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల గణన సర్వే బుదవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం పూర్తయినట్లు స్పెషల్ కమిషనర్, సమాచార, పౌరసంబంధాల శాఖ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.ఈ సమగ్ర ఇంటింటి సర్వే లో మొత్తం 1,18,02,726 నివాసాలు గుర్తించారు. బుదవారం నాటికి…

అన్నదాతలను దగా చేసి రైతు పండుగలా?

mla harees rao fire on congress govt

రైతుల కోసం 54,280 ఖర్చు చేశామనడం సిగ్గు చేటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : ఏడాదిగా రైతులను దగా చేసి ఇప్పుడు రైతు పండుగ పేరిట విజయోత్సవాలు జరపడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం కోసం 54,280…