- ఆకట్టుకున్న ఇక్కత్ చీరల డిజైన్ లు
- అపూర్వ స్వాగతం కు అబ్బురపడ్డ అందగత్తెలు.
- మ్యాజిక్ మ్యూజిక్ కు లయబద్దంగా నర్తించిన
అందాల నారిమణులుసాంస్కృతిక వారసత్వం, ఇక్కత్ చీరల నేతకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన భూదాన్ పోచంపల్లి గ్రామ చేనేత పార్క్ ఈసారి అంతర్జాతీయ సుందరీమణుల మన్ననలు పొందింది.గురువారం ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన 25 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు ఈ గ్రామాన్ని సందర్శించి, స్థానిక సంస్కృతి, కళలతో, మ్యూజిక్ తో మమేకమయ్యారు. సిందూరం, సంగీతం, చేతినేతల మధ్య కళాత్మకమైన ఈ సందర్శనం అతిథుల హృదయాలను రంజింపజేసింది.*సంప్రదాయ స్వాగతం, సాంస్కృతిక సంబంధాలు:*
గ్రామ చేనేత పార్క్ ప్రవేశద్వారం వద్దే స్థానికులు సంప్రదాయ దుస్తుల్లో కంటెస్టెంట్లకు స్వాగతం పలికారు. సిందూరం నుదుట దిద్ది, పువ్వుల మాలలు అందిస్తూ “పోచంపల్లికి హృదయపూర్వక స్వాగతం” అంటూ అందగత్తెలకు హృదయాలను హత్తుకునేలా ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్క్ మ్యూజియంలోని స్టాల్ లను సందర్శించారు.
*ఇక్కత్ చీరల రహస్యాలు – కళకు కన్నులు చిలుకరించిన అనుభవం:*
ప్రత్యేకమైన ఇక్కత్ చీరల తయారీ విధానాన్ని స్థానిక పార్కులో.పరిశీలించిన అతిథులు, నూలు వడకడం నుంచి రంగులు చొప్పించే క్లిష్టమైన ప్రక్రియలను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. “ఒక్క చీరకు వారాలు తీసుకునే శ్రమ, డిజైన్ల సృజనాత్మకత
కంటెస్టెంట్ లను మనస్సును హత్తుకుంది. చీరలపై భిన్న డిజైన్లను గమనించిన అతిథులు, కొందరు స్వయంగా రాట్నంతో నూలు వడికే ప్రయత్నం చేశారు.*లయబద్ధ నాట్యాలు – కిన్నెర, డప్పు ధ్వనుల మాయ:*
స్థానిక కళాకారులు ప్రదర్శించిన కిన్నెర, డప్పు వాయిద్యాల మధుర సంగీతం అందగత్తెలను మంత్రముగ్ధుల్ని చేసింది. కొందరు కంటెస్టెంట్ లు స్వయంగా కిన్నెర, డప్పు వాయించగా, మరికొందరు సంగీత లయకు అనుగుణంగా నాట్యం చేశారు.
*చేతుల మెహందీ, చేతితో రాట్నం:*
సందర్శన కంటెస్టెంట్ లు స్థానిక కళాకారుల నుంచి మెహందీ టాటూలు వేయించుకున్నారు. అరి చేతులపై నెమలి సోయగం, నాజూకైన నక్షత్రాలు, పువ్వుల డిజైన్లతో మురిసిపోయిన బ్యూటీలు ఫోటో సెషన్లకు పోజ్ ఇచ్చారు. రాట్నం తో నూలు వడికే విధానం ను సుందరీమణులు పరిశీలించారు.
కొంత మంది స్వయంగా రాట్నం ఒడికి మురిసిపోయారు.చివరగా అంపి థియేటర్లో భూదాన్ పోచంపల్లి ప్రస్థానం, హ్యాండ్లూమ్‌పై ప్రత్యేక వీడియోను మిస్ వరల్డ్ కంటెస్టెంట్ లకు ప్రదర్శించారు.
*ప్రతి క్షణాన్ని అందగత్తెలు ఆస్వాదించేలా చక్కని ఏర్పాట్లు*
మిస్ వరల్డ్ కంటెస్టెంట్ ల రూరల్ టూర్ నిర్వహించడంలో ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న జిల్లా యంత్రాగం స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం, సమన్వయంతో
*జిల్లా కలెక్టర్ ఎం హనుమంత రావు* నేతృత్వంలో
పోచంపల్లి గ్రామ చేనేత పార్క్ లో ప్రపంచ అందాల రాయబారుల కోసం చక్కని ఏర్పాట్లు చేశారు.
చేనేత పార్క్ కు ప్రపంచానికి పరిచయం చేసేలా వరల్డ్ టూరిజం లో ప్రత్యేక గుర్తింపు దక్కేలా చక్కగా
ప్రమోట్ చేశారు.
3 గంటలకు పైగా సాగుతున్న కార్యక్రమంలో
స్థానిక కళాకారులు వాయిద్యాలు, మెహందీ, చేనేత వస్త్రాల ప్రాధాన్యం, తయారీ, ఇక్కత్ చీరల ప్రత్యేక గుర్తింపును తెలియజేస్తూ స్థానిక సంస్కృతితో కంటెస్టెంట్ లను పూర్తిగా మమేకం అయ్యేలా చేశారు. ప్రతి క్షణాన్ని అందగత్తెలు ఆస్వాదించేలా కార్యక్రమాలను ప్లాన్ చేసారు.
ఈ మొత్తం కార్యక్రమంను మ్యాజిక్ మ్యూజిక్ కు లయబద్దంగా నర్తిస్తూ అతిథులు ఆనందంగా గడిపారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఎం హనుమంత రావు, భువనగిరి ఎమ్మెల్యే కె అనిల్ కుమార్ రెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
భూదాన్ పోచంపల్లి లో మిస్ వరల్డ్ భామల సందడి
