Category తెలంగాణ

మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన

మేడ్చల్/ఉప్పల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: మీర్‌పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్‌లోని బండబావి ప్రదేశంలో రూ.9 కోట్ల అంచనాతో తలపెట్టిన మల్టీస్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంగ‌ళ‌వారం శంకుస్థాప‌న చేశారు. కార్య‌క్ర‌మంలో  నగర మేయర్  గద్వాల విజయలక్ష్మి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, డిప్యూటీ మేయర్  శ్రీలత శోభన్ రెడ్డి,…

పోరాటాల పురిటిగడ్డలో పుర ఎన్నికలు రసవత్తరం

– ఐదు మున్సిపాలిటీలు తమవేనంటూ కాంగ్రెస్ ధీమా – ఉనికి కోసం పోరాడుతున్న ప్రతిపక్షాలు సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేట గడ్డకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇది నైజాంపై పోరాడి ప్రపంచ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పుటిగడ్డ. అనంతరం జరిగిన మహత్తరమైన రాష్ట్ర ఆవిర్భావ…

సీఎం గారూ.. మీకు మానవత్వం ఉందా?

– రిటైర్డ్ ఉద్యోగులను వేదనకు గురిచేయడం న్యాయమా? – కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: రిటైర్ అయ్యి రెండేళ్లయినా బెనిఫిట్స్ బకాయిలను చెల్లించకపోవడం దుర్మార్గమని కేంద్ర హోం శాఖ‌ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు తనువు…

కార్ల సర్వీస్ సెంటర్‌లో అగ్నిప్రమాదం

– దగ్ధమైన కార్లు.. పెద్ద ఎత్తున నష్టం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ కార్ల కంపెనీ సర్వీస్ సెంటర్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలు కార్లు దగ్ధమయ్యాయి. రాజేంద్రనగర్ మారుతీ సుజుకీ సర్వీస్ సెంటర్‌లో ఈ సంఘటన జరిగింది. భారీ అగ్ని ప్రమాదం…

రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలి

– అధికారులను ఆదేశించిన సీఎస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 4వ దశలో భాగంగా రాష్ట్రంలో రోడ్ కనెక్టివిటి లేని 227 ఆవాసాల్లో 642 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పీఎంజిఎస్‌వై…

బైక్‌పై ప్రమాదకర విన్యాసాలు వ‌ద్దు

– యువతకు సీపీ సజ్జన్నార్‌ ‌హెచ్చరికలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 10: బైక్‌పై ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న యువతకు హైదరాబాద్‌ ‌సీపీ వీసీ సజ్జనార్‌ ‌గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. నగరంలో యువకులు బైక్‌పై చేస్తున్న ప్రమాదకర విన్యాసాలు సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అవుతున్న నేపథ్యంలో సీపీ సజ్జన్నార్‌ ‌’ఎక్స్’ ‌వేదికగా స్పందించారు. వాహనాలను బాధ్యతాయుతంగా నడపాలని సూచించారు. బైక్‌…

రాష్ట్రంలో రేపు మున్సిపల్ ఎన్నికలు

రాష్ట్రంలో నేడు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ – 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో.. – బరిలో మొత్తం 12,930 మంది అభ్యర్థులు – భారీగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం – అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల భద్రత – మక్తల్‌లో అభ్యర్థి ఆత్మహత్య.. 6వ వార్డు ఎన్నిక వాయిదా హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10:…

డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి

– సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: రాష్ట్రంలో డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామక ష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబ్కేదర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షాసమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయశాఖ సలహాదారుడు, అగ్రిస్టాక్ చీఫ్ నాలెడ్జ్…

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

ఖమ్మం, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 9: జిల్లాలో సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కారు. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి వద్ద రహదారిపై రాస్తారోకోకు దిగారు. సాగు నీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే నీటిని అందించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్ నుంచి అధికారులు నీళ్లు విడుదల చేయకపోవడంతో తమ మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని రైతన్నలు ఆందోళన…