బైక్‌పై ప్రమాదకర విన్యాసాలు వ‌ద్దు

 యువతకు సీపీ సజ్జన్నార్‌ ‌హెచ్చరికలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 10: బైక్‌పై ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న యువతకు హైదరాబాద్‌ ‌సీపీ వీసీ సజ్జనార్‌ ‌గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. నగరంలో యువకులు బైక్‌పై చేస్తున్న ప్రమాదకర విన్యాసాలు సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అవుతున్న నేపథ్యంలో సీపీ సజ్జన్నార్‌ ‌’ఎక్స్’ ‌వేదికగా స్పందించారు. వాహనాలను బాధ్యతాయుతంగా నడపాలని సూచించారు. బైక్‌ ‌మీద చేసే ఈ చిత్రవిచిత్రమైన విన్యాసాలు చూడటానికి థ్రిల్లింగ్‌గా అనిపించవచ్చని.. కానీ అవి క్షణాల్లో ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడతాయని ఆయన హెచ్చరించారు. బైక్‌ ‌విన్యాసం నూరేళ్ల ఆయుష్షుకు వినాశనం అంటూ ఆయన పేర్కొన్నారు. చిన్న ప్రమాదం జరిగినా జీవితాంతం మంచానపడాల్సి వస్తుందని అన్నారు. అంతేకాక  మీ వల్ల ఇతరులు కూడా ప్రమాదాలబారిన పడొచ్చని తెలిపారు. సోషల్‌ ‌మీడియాలో లైకులు, వ్యూస్‌ ‌కోసం రోడ్డు మీద హీరోయిజం చూపించాలనే ఆశతో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సజ్జనార్‌ ‌సూచించారు. బైక్‌పై స్టంట్లు చేస్తూ వెనుక కూర్చున్న వ్యక్తుల ప్రాణాలను కూడా రిస్క్‌లో పెడుతున్న ఈ చర్యలు చట్టరీత్యా నేరమన్నారు. ఇలాంటి వాటి వల్ల కేసుల పాలై సమస్యలను కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు. బాధ్యతగా డ్రైవ్‌ ‌చేయండి అంటూ సీపీ సజ్జనార్‌ ఉద్బోధించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *