Category సాహిత్యం-శోభ

సంక్రాంతి

పిల్లా పోదాం పదవే పల్లెకి పిలగా ఏముంది రా పల్లెలో పంట చేతికొచ్చే వేళ జరుపుకునే పండుగకి పోదామే కళకళలాడే లోగిళ్ళను చూద్దామే ఎనకటి రోజులు కావయ్యా ఎదురుచూసే మనుషులు లేరయ్యా పావురంగా జూసుకునే బంధాలు లేవయ్యా ప్రపంచీకరణ బాంధవ్యాలను చిదిమేసిందయ్యా అట్టెట్టనే పిల్లా పచ్చాని పల్లె కళ్ళల్లో తిరుగుతుందే మల్లా ఏం చేద్దునే పిల్లా ఓరోరి పిలగా…

మెరుపు తీగెలు దోషి!

“అమ్మా…” గొంతు నరాలు చిట్లిపోయేలా అరిచాడు ‘దోషి’. “ఒరేయ్… ఆ నోట్లో లాఠీదించి దెం…” యస్సై చెప్పిన మాటని అర్థం చేసుకున్న కానిస్టేబులు దోషి నోట్లో గుడ్డని కుక్కాడు. ఆర్తనాదం అణిగిపోయింది. బోర్లా పడుకోబెట్టిన దోషి వీపుమీద వొక కానిస్టేబులు తొక్కి కూచుంటే, మరో యిద్దరు కానిస్టేబుళ్ళు అరికాళ్ళమీద లాఠీలతో బాదుతూనే వున్నారు. చాలక యస్సై…

అగ్నిపద్యం అలిశెట్టి కవిత

దోపిడి వటవృక్షాలను దహించే అగ్నిపద్యంలా అల్పాక్షరాలతో అనల్పార్థాన్ని సృష్టించిన అక్షరయోధుడు అలిశెట్టి ప్రభాకర్. తుపాకీ తూటాలా తన భావాలను సూటిగా గుండెలను తాకించగల శక్తి అలిశెట్టి అక్షరానిది.  కరెన్సీ స్పర్శ కంటే కవిత్వంలోనే సేదతీరిన రచనా పిపాసి. రాతకు చేతకు లేశమాత్రం తేడా లేని నిండైన నిఖార్సయిన ఆచరణశీలి. నాలుగు పదులు కూడా దాటని అలిశెట్టి…

పాస్‌పోర్ట్

ఒక చిన్న పుస్తకం చేతిలో పట్టుకున్న సరిహద్దు కాగితాల మధ్య నా పేరు ప్రయాణం మొదలుపెడుతుంది ఇందులో దేశం ఉంది కాని నేల లేదు గుర్తింపు ఉంది కాని పూర్తైన మనిషి లేదు నేను ఇక్కడ కేవలం అనుమతి ముద్రలు పడుతుంటే కాలం గీతలు వేస్తుంది ప్రతి స్టాంప్ “నువ్వు వెళ్లవచ్చు” అనే అస్తిత్వపు ఒప్పందం మెటాఫిజిక్స్ అడుగుతుంది భూమి అందరిదైతే ప్రవేశానికి పుస్తకం ఎందుకు మనిషి స్వేచ్ఛ ఎప్పుడు ఫారమ్ అయింది పాస్‌పోర్ట్ చెబుతుంది నువ్వు ప్రపంచ పౌరుడు కాదు ముందుగా ఒక విభాగం ఆ తర్వాతే మనిషి కాలం మారుతుంది వీసా ముగుస్తుంది పాస్‌పోర్ట్ మాత్రం మిగిలిపోతుంది నువ్వు ఎక్కడ ఉండగలవో చెప్పే నిశ్శబ్ద అధికారిగా చివరికి ప్రయాణం ముగుస్తుంది పుస్తకం మూసివేయబడుతుంది కానీ ప్రశ్న తెరిచే ఉంటుంది మనిషి ప్రయాణికుడా లేక సరిహద్దుల సృష్టేనా…

కథా అఖిలం

సాహిత్యం సామాన్య కాలక్షేపం కాదు, సమాజ సీమాంతరాలను తడమి తట్టి లేపే సంజీవని సెలయేరు. అక్షరం ఆయుధమైనచో అన్యాయాలను ఖండిస్తుంది, అమృతమైనచో అంతరాత్మను ఆలింగనం చేస్తుంది. రచయిత్రి రాధ ఓడూరి గారి రసమయ రచనలు రూపొందిన “కథా అఖిలం – కథల నిధి” అనే ఈ అమూల్య ఆభరణం, ఆధునిక జీవన జలధారలో మానవత్వ మకరందాలను…

క్వాంటం ప్రపంచం

కాలపు గుండె పుస్తకంలో క్యాలెండర్ పేజీ మారింది జ్ఞాపకాల మెసెంజర్ గ్యాలరీతో ఓ సంవత్సరం వీడ్కోలు పలికింది నులివెచ్చని జ్ఞానకిరణాల వెలుగులో ఆత్మీయ వేడుకల జలధారలో స్వాగతమంటోంది క్వాంటం ప్రపంచం   విజయాలు వివాదాలు విప్లవాలు విషాదాలు వికాసాలు ఇలాంటివెన్నో అనుభూతుల ఇంద్రధనస్సు కదా జీవితమంటే నీలో నీతో బతుకు యుద్ధం నేర్చుకుంటే ప్రతి నిమిషం…

హృదయ పీఠంపై నీవెన్నడూ కూసోలేదు

ప్రియమైన ఇష్టుడా నీకొక ఉత్తరం రాయక ఎన్నో ఏండ్లు గడిచిపోయినవి గడిచిన ఇన్నేండ్లలో నీకో ఉత్తరం రాద్దామనుకున్నపుడల్లా అడ్డుపడి ఆపుతున్న కన్నీళ్లు లోపలా బయటా  భయం ఆవహిస్తున్నపుడూ లోలోపలి భావాలను స్పష్టంగా ఎట్లా చెప్పగలను చెప్పు   ఈ చీకటి రాజ్యం తెరమీద నీవో వెలుగవుతావని కలగన్నా కానీ నీ వెలుగే చుట్టేమీ కండ్లబడకుండా చీకటిని తెస్తుందనుకోలేదు…

కొత్తపొద్దు కోసం

ఇవాళ్టి దుఃఖం రేపటికి మాసిపోవాల అటకెక్కిన ఆనందం ఒక్కో మెట్టు దిగి రావాల గలుమ కాడికొచ్చిన కొత్త పొద్దు తోరణాలు కట్టుకున్న దర్వాజాను తాకుతూ నట్టింట్లో నాట్యమాడాల   కొత్తదనపు కుతి తీరేదాకా పొద్దు తిరుగుడు పువ్వోలె ఇటునుంచి అటేపు పెయ్యిని తిప్పుతూ వుండాల   చాప కింద నీరోలే చీకట్లు అలుముకోకుండా పసిగట్టి ఊడ్చి…

కృష్ణ బిలం

మిత్రుడి కోసం కొన్ని వాక్యాలెప్పుడూ యెదురుచూస్తూ వుంటాయి సముద్ర తీరంలో అలల అరల్లో నింపుకున్న కొన్ని జ్ఞాపకాలు   రాత్రి చెప్పుకున్న వింతైన మాటలూ యీ ప్రపంచానికి నువ్వు చెప్పాలనుకున్న నీ అస్థిత్వము అన్నీ అద్భుతాలే నాకు   యీ విశ్వం గురించి నీ ఆలోచనలు స్థానభ్రంశం చెంది నాదాకా చేరిన క్షణాలు నాకింకా గుర్తే…