Category సాహిత్యం-శోభ

ద్రావిడ సాహిత్యోద్యమం రాబోతున్నదా?

“ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఎనిమిదో మహాసభలు ఫిబ్రవరి 7 & 8 తారీఖుల్లో కర్నూల్లోని కెవిఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరుగనున్నాయి. మహాసభల అంశం: ద్రావిడ సమాజ సాహిత్యాలు – సారూప్యత- ఐక్యత – పోరాటం. ఈ సందర్భంగా ప్రజాతంత్ర ‘శోభ’ పేజీ పాఠకుల కోసం- సభలో పాల్గొంటున్న వక్తలకి ‘ద్రావిడ సాహిత్యోద్యమం రాబోతున్నదా?’…

ఊహల ఊడలు

నీ మాటొకటి పడి మొలిచి నా బ్రతుకులో పెద్ద వృక్షమయ్యావు. నీ తలపు వీచిప్పుడల్లా ఊగే ప్రతి ఊహ ఊడలు బారి ఆ నీడలో నీవెక్కడున్నా చల్లగా రోజూ కాసేపు గడుపుతాను. సేద తీరే ప్రతి సంగతిని తృప్తిగా మనసారా గుండెలో దాచుకుంటాను.. -శ్రీ సాహితి

కృత్రిమ మేధస్సు

ముందుగా ఒక నీడ పడింది ఆ నీడకు శరీరం ఇంకా లేదు దానిని భవిష్యత్తు నుంచి వచ్చిందంటారు, కాని అది నిలిచింది మన వర్తమాన ఆలోచనల గోడలపై. ఆ నీడకు మనమే పేరు పెట్టాం: “కృత్రిమ మేధస్సు.” పేరు పెట్టిన క్షణమే అది ఒక భావన నుంచి వస్తువుగా మారింది; ప్రశ్నగా కాదు… అనివార్యతగా స్థిరపడింది.…

ముఖయోగం!

మెరుపు తీగెలు డ్రెస్సింగ్ టేబుల్ యెక్కి అద్దంలో చూసుకున్న మార్జాలానికి యెదురుగా పిల్లి కనిపించింది! ‘మార్జాలమా నువ్వు పిల్లిగా మారిపోయావేం?’ ఆందోళనగా అడిగింది మార్జాలం. అలా అడుగుతున్నప్పుడు ‘జటా కటాహ సంభ్రమమ్ భ్రమమ్ – నిలింప నిర్జరీ – విలోల వీచి వల్లరి – విరాజ మాన మూర్ధవి – ధగద్దగ ధగజ్వలల్ల – లలాటా…

వాటిని తిరగరాసే హక్కు మనకి లేదు

ప్రపంచ సాహిత్యాన్ని ఇష్టంగా చదువుకుంటూ నిర్మొహమాటం, నిజాయితీ పరికరాలుగా సమకూర్చుకున్న అరుదైన విమర్శకురాలు నాగినీ కందాల. సాహిత్య విమర్శ నేపథ్యంగా ఆమె ‘శోభ’ పాఠకుల కోసం ఇచ్చిన ఈ విలువైన ఇంటర్వ్యూ మూడు వారాల పాటు ప్రచురిస్తాము. సాహిత్య విమర్శ పరిధి- రచనలోని గుణదోష విచారణ మాత్రమేనా, అంతకు మించి ఉంటే మీ దృష్టిలో అవేమిటి?…

గాలించండి కొంచం

విద్వేషాల మనుషులు వెదజల్లే హాలాహలం నేడు సమాజమంతా ఏదో తెలియని కలకలం ద్వేష దూషణలతో పగా ప్రతీకారాలతో రగిలిపోతూ ప్రపంచం యుద్ధ మేఘాలతో గడగడ లాడుతుంది ప్రతి ఇంట్లోనూ శాంతి కపోతాలకై గాలించండి కొంచం -శ్రిష్టి శేషగిరి

జ్ఞాపకాల జోలె

సంక్రాంతి పిలిచిందనీ ఊరెళ్ళాను. మిత్రులు రమ్మాన్నారని వీధులన్నీ తిరిగాను. మనిషి మనిషిలో పోలిక పోగులను విప్పుకుంటూ ఊరును మోస్తూ మనసు అర్ధరాత్రి ఇంటికి చేరింది. జ్ఞాపకాల జోలెను రాశిగా పోసి మట్టి కొట్టుకున్న తేదీలను సంవత్సరాలలో ముంచి తేల్చి మాట గుర్తులతో పలకరింపు హోదాలో దగ్గరై ప్రతి ఒక్కరు ఇష్టంగా ముందుకు నడుస్తుంటే తల నెరిసిన…

శతకాలకే మకుటం అప్పాజోస్యుల ‘సుగుణాఢ్య శతకం’

ఒక్కొక్క శతకపద్యం ఒక్కోరీతిలో ఒక సత్యాన్ని ప్రతిపాదిస్తుండటం అప్పాజోస్యుల శతకనిర్మాణ కౌశలం. ‘శతమును మించి సూర్యులును చంద్రులు నంతకుమించి మిన్నునం దతి రథులౌచు దీప్తకిరణాలి వసుంధర జిమ్మవచ్చు, త ద్ద్యుతి యిసుమంత లో నిరుల ద్రోలదు, సూరి వచో మరీచి హృ ద్గతమయి పూన్చులో వెలుగు తాదృశముల్ సుగుణాఢ్యవర్తనల్’ పద్యంలో అనేకమంది సూర్యులు, చంద్రులు మింటనుంచి…

ఒక తరం నడిచిన నడక 

“మనం ఒకవ్యక్తిని మరిచిపోతే పరవాలేదు. కానీ ఒకకాలాన్ని మరిచిపోతే ఎట్లా?  ‘సహచరులు’ మనకు చెప్పేది ఇదే మనచుట్టూ ఉన్నవాళ్లు మనతో నడిచేవాళ్లు మనతో మాట్లాడేవాళ్లు ఏదో ఒకరోజు చరిత్రగా మారతారు. ఇక్కడ సహచరులు పక్కనే నడిచిన వ్యక్తులు కాదు. ఒకే కలను భుజాలపై మోసినవాళ్ళు.  ఒకే భయాన్ని గొంతులో దాచుకున్నవాళ్ళు.  ఒకే మౌనాన్ని పంచుకున్న రాత్రులు. వి.వి. కవిత్వం…