తియ్యతీగలనిప్పు… దీర్ఘచింత బాణాల “కుంపటి”

ఒత్తిడీ ఒరిపిడీ … ఉమ్మనీరులో ఓలలాడించడానికి నాన్న పట్టుకున్న బతుకుదివ్వే ….ఈ కుంపటి యోజనాల రశ్మీతీర్థంలో సూర్యగోళానికి బతుకువచనాలిచ్చిన ఆహనబెంగ… తధాలత కల్వంలో నూరిపోసుకున్న శ్వాసలకి ప్రతిపదార్థం… కుంపటి… కదలాడే దీపకొండల్లో రాత్రి జాముని ఊదుతూ… పచ్చి కలల వేడిమి అంచుల్లో వర్ణమాయకై కరిగే ద్రవనర్తన…సమసంచయం… పరిస్తంభన. విస్మృతిలోని ధూపం …సమయంలోకి ఊదిన మహా వేడీ…







