మదిలో అనుభవ అనుభూతులు
దాచుకునేది
దాచుకున్న అనుభూతులను
బాషించి అక్షరీకరించేది జ్ఞాపకం
జ్ఞాపకాల జ్ఞానం ఉంటే జ్ఞాని
వాని నోట పలుకు వాణి
జ్ఞాపకం అంటే కాలజ్ఞానమే
జ్ఞాపకం ఉంటే
వెయ్యేనుగుల బలం ఉన్నట్లే!
జ్ఞాపకం తోసుపోకుండా
ఊసులన్నీ ఎరుక చేస్తది!
జ్ఞాపకాలతో సాగే జగతి
జ్ఞాపకం లేకుంటే మూగదవుతది
మస్తిస్క సాగరంలో కదలాడే
తరంగాలే జ్ఞాపకాలు!
బావోద్వేగాల బావిలో
ఊరే ఊటల ఉప్పొంగులే
తీపి చేదు జ్ఞాపకాలు
జ్ఞాపకాల బావ గాంబీర్యత
భాషణంలో శోభిస్తే
మైమరిచిపోతాము
తలపోతల జాతరలో
జ్ఞాపకాల నెమరువేతలు
మతిమరుపుల వెతుకులాటలు
జ్ఞాపకం మంచిదే
అప్పుడప్పుడు మరుపూ మంచిదే!
జ్ఞాపకాల దొంతరలే
యుగయుగాల సాధన సంపత్తులు
జ్ఞాపకం ఉంటేనే కదా సమ్మేళనాలు
జీవిత వ్యాపకాలు నడిచేది!
పి.బక్కారెడ్డి
9705315250