Category సాహిత్యం-శోభ

అస(శ)నిపాతం

ప్రశ్నాపత్రం బయట పెట్టారంటూ.. కటకటాల్లోకి నెట్టారు నారాయణున్ని.. గలీజు లీకేజి పథకం ఎవరు రచించినా.. రుజువైతే తగురీతిన సన్మానించాల్సిందే !   ‘అసని’ కారాదు రైతన్నకు అశనిపాతం నోటికాడి బుక్కను లాక్కోరాదు తుఫాన్లు ప్రకృతి విపత్తులే రైతులపాలిటి శాపాలు సాగు వెతల్తో కర్షకుల కళ్ళల్లో సునామీలు !   కొనసాగుతున్న లంక దహనం ఆర్పేవారెవరు ఈ…

వసుధైక నమూనా

కష్టసుఖాల కావడి బరువు సమానంగా పంచుకుంటూ, ఆలనాపాలనలకు ఆప్యాయతల దండవేస్తూ, ఐకమత్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఉమ్మడి కుటుంబాలు బంధాల విలువను,బలాన్ని మరోతరానికిజి ఆత్మీయంగా బోధించే పాఠశాలలు, సంస్కృతీ సంప్రదాయాల శిక్షణాశిబిరాలు. అవి హృదయాలకొక ప్రశాంతవాటిక వసుధైక కుటుంబానికి ప్రాతిపదిక మమతానురాగాల లోగిళ్ళలో అంతా ఒక గూటి పక్షులై, అరమరికల్లేని అరకలతో కుటుంబాల్ని సాగుచేసుకుంటూ, సహపంక్తి…

ద్వీప దేశం నేర్పే పాఠం

ఇపుడు ద్వీప దేశం శ్రీలంక రావణకాష్టమై రగులుతోంది పౌర సమాజం గడప దాటి ఆందోళనల బాట పట్టింది నింగినంటిన నిరసనలు చెలరేగుతున్న ఘర్షణలు హింసాత్మక ఘటనలతో శ్రీలంక అట్టుడుకుతుంది పాలించే నేతల దుర్నీతి ఓట్లను కొల్లగొట్టే ఆపతి పీఠంపై పట్టుబిగించే కుతి బంధు వర్గంపై ఆశ్రీత ప్రీతి అహేతుక ఆర్థిక విధానాలే శ్రీలంక సంక్షోభానికి కారణం…

అపారవశ్యం

మంచు కురిసిన పరిసర పసిరికల్లో ముసుగు వేసుకున్న ఆమె తెల్లని చేతుల దోసిట్లో కొన్ని నిన్నటి ప్రేమ బిందువులు పెదవుల్లో ఉబికి రాని దాటని మాటలు ఆ వనంలో రెక్కలు విదిలీయని పక్షుల్లా విరబూయని పువ్వుల్లా చీలిన చిగురుల్లా నిశ్చలంగా మూలుగుతున్న వృక్షాల్లా ఒక నిశ్శబ్ద నిరసన గీతాన్ని పాడుటకు సిద్ధంగా ఉన్నాయి ఆమె అనుమతికై…

నువ్వూ…నేనూ…వెన్నెల

మనమిద్దరం తొలి సంధ్యలో ప్రయాణం మొదలుపెట్టినప్పుడు తొలికిరణాల స్పర్శతో పులకించిపోయిన ఎన్నెన్ని పూల బాసలు! ఆకాశమే హద్దుగా కిలకిలలాడిన ఎన్నెన్ని పక్షుల ఊసులు! ఆనందమే ఆశయంగా చిగురులు తొడిగిన ఎన్నెన్ని వసంత రాగాలు! మన సంతోషాలతో జత కలిపిన ఎన్నెన్ని తొలకరి జల్లులు! మన ప్రయాణంలో మనమధ్య బద్దలైన అగ్నిపర్వతాల ఎన్నెన్ని విస్పోటనాలు! మన కోపాలతో…

అర్దాల ఏకమే!

రోజు అంటే… రేయింబవళ్ళ చలనమే! సంవత్సరము అంటే రెండు ఆయనాల ఆవృతమే! దారికి తెలియని గమ్యం రెండు పాదాల గమనమే! పగలు – రేయికి రాజులు ఆ సూర్య – చంద్రులే! కారు చీకటి మబ్బుల్లో మిలమిల మెరుపుల ఉరుములే! వినీలాకాశానికి అందం మిలమిల మెరిసే తారక లే! జీవులు పుట్టుట- గిట్టుట పెరిగి -విరుగుట…

మారని చరిత

తనకెన్ని సమస్యలెదురైన బెదరక అడుగేసేటోడే నేటిమనిషి తన ఉనికికే ఎసరొచ్చినా ఏంమాట్లాడని మౌనముని బతుకెంత భారమైన బాధపడతాడే తప్ప కారణాలెతకడు ఎందుకంటే ప్రతిదానికి కారణమతడేగనుక చెమటను చిందిస్తూ చింతలేక బతికిన దినాలెన్నో రేపటికై చింతలేనోడొకపుడు తెలిసిన తెలియకున్నా చేసే పనిలో న్యాయముండేది నాయకుడైనా అనాముకుడైన జీవనగమనంలో సంతోషం వెతుకునేటోళ్ళు లోకంలోకొచ్చింది ఇచ్చిపోవడానికని తోచినంతలో మంచికై ముందడుగేసేవాళ్ళు…

నేను ఒంటరిని…

అవమాన బాణాలు ఎదలో గుచ్చుకొంటుంటే అటు సంద్రంలోని ‘‘అసని’’ తుఫాను ఇప్పుడు నా ఎదలోనూ మొదలయ్యింది. వర్తమానం నచ్చక భవిష్యత్తు గోచరించక, ఆలోచనల అలలు ఎగిసిపడుతూ సతమతమవుతోన్న  మదిలో ఉన్న ఆవేదనకు మరో ఆవేదన తోడవుతోంటే ఆవేదనా మబ్బులు కమ్మిన ఎదలో కన్నీటి వర్షం కురుస్తోంది. ఎన్నో నియంత్రణల కంచెలు వేసుకొని నడిచే జీవచ్ఛవంలాంటి యాంత్రికమైన…

పుట్టెడు దుఃఖం

పిలవని పేరంటమైంది హఠాత్తు గా ఊడి పడింది నోటికాడికి వచ్చింది మింగేసింది మండుటెండలలో మడత పెట్టేసింది ఉరమని పిడుగై ముంచ్చేసింది రైతన్నలను ఉసూరు మనిపించింది ఎప్పుడైనా ఈ వింత చూసామా అనిపించింది బ్రహ్మం గారి వాక్కు నిజ మనిపించింది పంట విరగ పండింది రేటు బాగుంది రైతు రాతను మార్చేసింది అప్పుల సుడిలోంచి బయట పడేసే…