వీరేశ్వరరావు మూల
నాన్న చెప్పిన కధే మళ్లీ చెప్తాడు
నాకు ఒక రాత్రి తెలిసిపోతుంది
నాన్న దగ్గర కథలు లేవని
వ్యధలు మిగిలాయని
నాన్నేది దాచుకోడు
నాన్న చొక్కాకి జేబు అందుకే లేదేమో
నాన్న కన్నీళ్లు కడుపులోకి పోతాయేమో
దాహం కూడా వెయ్యదంటాడు
నాన్న దగ్గర ఏదో మంత్ర దండం ఉంది
అందుకే అన్ని వేళల మాకు అండదండ
మాకు అన్నీ అమరుస్తూ ఉంటుంది
నాన్న నిఘంటువులో లేదనే పదం లేదు
నాన్నకి పాత సైకిల్ పాత చెప్పులు
భయమేసినపుడు చదువుకునే
హనుమాన్ చాలీసా
తప్ప పెద్దగా వస్తువులు లేవు
అప్పుడప్పుడు పస్తులు
నాన్న బనీనులో నక్షత్రాలే కాదు
అప్పుడప్పుడు చంద్రుడు కూడా ఉంటాడు.
జీవితమంతా స్వేదవేదంగా
మారిన నాన్నకు జీవితం ఏమి మిగిల్చింది
నాన్న ఇప్పుడు ముదిమితీరంలో
నడుము విరిగిపోయిన నావ
తుప్పు పట్టిన సైకిల్
తోలు అరిగిపోయిన చెప్పు
నాన్న ఒక పాత సామాను
గత బంధాలు భ్రాంతులై,
వృద్దాశ్రమంలో కొమ్మలు విరిగిన మానై
కేలండర్ అంతా కృష్ణపక్షమై
ఆయువు, విధి రావణుడి చేతిలో జటాయువై
జీవన ఏడారిలో ఆత్మీయ ఒయాసిస్సుకై
మరీచికల వైపు పయనించే ఉష్ట్రమైన నాన్న
కష్టాలలో లీనమైన వాయులీనం
నాన్న చెప్పిన కధే మళ్లీ చెప్తాడు
నాకు ఒక రాత్రి తెలిసిపోతుంది
నాన్న దగ్గర కథలు లేవని
వ్యధలు మిగిలాయని
నాన్నేది దాచుకోడు
నాన్న చొక్కాకి జేబు అందుకే లేదేమో
నాన్న కన్నీళ్లు కడుపులోకి పోతాయేమో
దాహం కూడా వెయ్యదంటాడు
నాన్న దగ్గర ఏదో మంత్ర దండం ఉంది
అందుకే అన్ని వేళల మాకు అండదండ
మాకు అన్నీ అమరుస్తూ ఉంటుంది
నాన్న నిఘంటువులో లేదనే పదం లేదు
నాన్నకి పాత సైకిల్ పాత చెప్పులు
భయమేసినపుడు చదువుకునే
హనుమాన్ చాలీసా
తప్ప పెద్దగా వస్తువులు లేవు
అప్పుడప్పుడు పస్తులు
నాన్న బనీనులో నక్షత్రాలే కాదు
అప్పుడప్పుడు చంద్రుడు కూడా ఉంటాడు.
జీవితమంతా స్వేదవేదంగా
మారిన నాన్నకు జీవితం ఏమి మిగిల్చింది
నాన్న ఇప్పుడు ముదిమితీరంలో
నడుము విరిగిపోయిన నావ
తుప్పు పట్టిన సైకిల్
తోలు అరిగిపోయిన చెప్పు
నాన్న ఒక పాత సామాను
గత బంధాలు భ్రాంతులై,
వృద్దాశ్రమంలో కొమ్మలు విరిగిన మానై
కేలండర్ అంతా కృష్ణపక్షమై
ఆయువు, విధి రావణుడి చేతిలో జటాయువై
జీవన ఏడారిలో ఆత్మీయ ఒయాసిస్సుకై
మరీచికల వైపు పయనించే ఉష్ట్రమైన నాన్న
కష్టాలలో లీనమైన వాయులీనం