ఓహో!

-బమ్మిడి జగదీశ్వరరావు నాకు అద్దం అంటే యిష్టం! అద్దంలో నన్ను నేను చూసుకున్నాను. చూసే కొద్దీ చూడబుద్ధయింది. అందంగా వున్నాననీ అనిపించింది. నవ్వుకున్నాను. అద్దంలోని నా ప్రతిబింబమూ నవ్వింది. నేను నవ్వు ఆపితే నా ప్రతిబింబమూ నవ్వడం ఆపేసింది. నేను సీరియస్సుగా చూశాను. నా ప్రతిబింబం కూడా అంతే సీరియస్సుగా చూసింది. నేను కన్ను గీటితే…








