దెబ్బలకు
సిద్ధమవుతోంది
బడిగంట
*
బడిగంట
అలారం కొట్టింది
సెలవులు నిద్రలేచాయి
*
బడిగంట చాటింపు
సెలవులైపోయాయి
బేగిరమ్మని
*
వలసపోయిన
పిచ్చుకలన్నీ
బడిబాట పట్టాయి
*
బడిది అమ్మపిలుపు
ఆడుకుంది చాలు
ఇక రండిరా అని
*
ఒంటరితనం
ఎగిరిపోయింది
పిల్లలే బడికి రెక్కలు
*
పిల్లలంతా
బడిబాట పట్టారు
రేపటి గమ్యం కోసం
*
బడిబాట –
పిల్లలకభివాదం చేస్తూ
ఇరువైపులా గడ్డిపోచలు
*
బళ్లు తెరిచారు
ఇక దెబ్బలు మొదలు
పిల్లలకూ బడిగంటకూ
*
బడిగంట
గొంతెత్తి పిలుస్తోంది
పిల్లలూ బడి తెరిచారని
*
బడిబాట –
నిండా మొలిచిన గడ్డి
పిల్లలకు దారినిస్తూ
*
బడిబాట
గడ్డిపోచలెగిరెగిరి చూస్తున్నాయి
పిల్లలొస్తున్నారని
*
బడిగంట
ఈరోజు పిల్లలందరికీ
అలారమయింది





