– రోబోటిక్ సర్జరీతో ప్రాణం కాపాడిన కేర్ హాస్పిటల్స్
– సాధారణమే అనుకుంటే చివరికి క్యాన్సర్‌గా నిర్ధారణ
– నిరంతర దగ్గు, అసౌకర్యం లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు: వైద్యులు
– సాధారణమే అనుకుంటే చివరికి క్యాన్సర్‌గా నిర్ధారణ
– నిరంతర దగ్గు, అసౌకర్యం లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు: వైద్యులు
హైదరాబాద్, ఏప్రిల్ 21: ఓ వ్యక్తి (53 ఏళ్ల రామారావు)కు మొదట్లో కనిపించిన లక్షణాలు పెద్దగా ఆందోళన కలిగించేవిగా అనిపించలేదు. నిరంతర దగ్గు, పై పొట్టలో స్వల్ప అసౌకర్యం..సాధారణ గ్యాస్ట్రిక్ సమస్య అనుకుని కొన్ని రోజులు నిర్లక్ష్యం చేశారు. కానీ సమస్య తగ్గకపోవడంతో చివరకు హైటెక్ సిటీలోని కేర్ హాస్పిటల్స్‌ను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది, ఆహారనాళం, కడుపు కలిసే భాగంలో వచ్చే గ్యాస్ట్రోఈసోఫేజియల్ జంక్షన్ క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. సమయానికి స్పందించిన వైద్య బృందం అధునాతన డా విన్చి రోబోటిక్ సిస్టమ్ సాయంతో క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఈ సాంకేతికత ద్వారా శరీరంలోని సన్నని, క్లిష్టమైన ప్రాంతాల్లో కూడా అత్యంత ఖచ్చితత్వంతో ట్యూమర్‌ను తొలగించడం సాధ్యమైంది. హైపర్‌టెన్షన్, డయాబెటిస్ ఉన్న ఈ రోగికి పూర్తి గ్యాస్ట్రెక్టమీ (కడుపు పూర్తిగా తొలగింపు) చేసి జేజునోస్టమీ ద్వారా ఆహార మార్గాన్ని పునర్నిర్మించారు. ఈ శస్త్రచికిత్సను కేర్ హాస్పిటల్స్ సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ఎన్.కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో డాక్టర్ ముస్తఫా హుస్సేన్ రజ్వీ, వారి బృందం విజయవంతంగా నిర్వహించింది. రోగికి కడుపులో ప్రభావిత భాగాన్ని తొలగించి ఆహారం వెళ్లే మార్గాన్ని పునర్నిర్మించారు. ఆహారనాళాన్ని చిన్న ప్రేగుతో కలిపి అవసరమైనచోట్ల ప్రేగులను అనుసంధానం చేశారు. అదనంగా రోగి కోలుకునే సమయంలో ఆహారం అందించేందుకు ప్రత్యేక ట్యూబ్ ఏర్పాటు చేశారు. శస్త్రచికిత్స అనంతరం రోగి స్థితి స్థిరంగా ఉండి అవసరమైన వైద్య చికిత్సలతో త్వరగా కోలుకొని ప్రస్తుతం ఇంటికి వెళ్లి ఆరోగ్యంగా జీవనం సాగిస్తున్నారు. హైటెక్ సిటీలోని కేర్ హాస్పిటల్స్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఎన్.కరుణాకర్ రెడ్డి, మాట్లాడుతూ ఆహారనాళం-కడుపు కలిసే భాగంలో వచ్చే క్యాన్సర్లు గుర్తించడం కష్టం. ప్రారంభంలో స్పష్టమైన లక్షణాలు ఉండవు కాబట్టి చాలామంది రోగులు ఆలస్యంగా వస్తారు. నిరంతర అసౌకర్యం, కారణం లేకుండా వచ్చే దగ్గు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. సమయానికి గుర్తించి రోబోటిక్ సర్జరీ వంటి ఆధునిక సాంకేతికతతో చికిత్స చేస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయి. ఈ టెక్నాలజీ ద్వారా సన్నని, చేరుకోలేని ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా శస్త్రచికిత్స చేయగలుగుతున్నాం అని తెలిపారు. కేర్ హాస్పిటల్స్ జోనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నీలేష్ గుప్తా మాట్లాడుతూ ఈ కేసు సమయానికి వైద్య పరీక్షలు ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. క్లిష్టమైన క్యాన్సర్ కేసుల్లో మల్టీ డిసిప్లినరీ వైద్య బృందం సమన్వయం ఎంత ప్రభావవంతంగా ఉంటుందో చూపించింది. కేర్ హాస్పిటల్స్‌లో తాము అధునాతన వైద్య సేవలను అందించేందుకు తమ సామర్థ్యాలను నిరంతరం బలోపేతం చేస్తున్నాం అని చెప్పారు. జీర్ణాశయ సంబంధిత క్యాన్సర్లు దేశంలో క్యాన్సర్ కారణంగా జరిగే మరణాల్లో ముఖ్యమైన వాటిలో ఒకటి. ప్రారంభ దశలో లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల చాలా కేసులు ఆలస్యంగా గుర్తించడం జరుగుతోంది. కాబట్టి అవగాహన మరియు సమయానికి వైద్య పరీక్షలు చాలా అవసరం. ఈ కేసు కేర్ హాస్పిటల్స్‌లో ఉన్న అధునాతన గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఆంకాలజీ నైపుణ్యాన్ని, సమగ్ర వైద్య విధానాన్ని ప్రతిబింబిస్తోంది.
——————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





