- మనస్తాపంతో రైతు ఆత్మహత్య
ఆదిలాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17: రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పులు చేసి పంటలు పండిస్తే కొనేనాథుడు లేక వర్షాలకు ధాన్యం తడిసిపోయి రైతులు అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన నుగూరే పాండురంగ్(48) అనే రైతు తాను పండించిన జొన్న పంటను విక్రయించేందుకు మే 23న తేదీన సిరికొండ కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. హమాలీలకు డబ్బులు చెల్లించిన అనంతరం లారీలో లోడ్ చేసేందుకు అదనంగా డబ్బులు ఇవ్వాలని కొనుగోలు కేంద్రం సిబ్బంది డిమాండ్ చేశారు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని, పది రోజులైనా జొన్నలు లోడ్ చేయలేదని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.