– భర్తను రోకలి బండతో కొట్టి చంపిన భార్య
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. రిటైర్మెంట్ డబ్బుల కోసం భర్తను భార్య రోకలి బండతో కొట్టి హతమార్చడం కలకలం రేపింది. స్థానిక హనుమాన్ నగర్‌లో చెందిన వెంకటేశం-రాజమణి దంపతులు నివస్తున్నారు. వెంకటేశం ఆసిఫాబాద్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. రాజమణి ఏఎనఎంగా విధులు నిర్వర్తిస్తున్నది. అయితే ఈ నెలలో వెంకటేశం పదవీ విరమణ చేయాల్సి ఉండగా రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి విషయంలో దంపతులు గొడవపడ్డారు. ఈ గొడవ పెద్దదిగా మారడంతో ఆగ్రహించిన రాజమణి భర్తను రోకలి బండతో కొట్టి దారుణంగా హతమార్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాజమణిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు


