రాజమహేంద్రవరంలో విషాదం

– గోదావరిలోకి దూకి ఏఈ కుటుంబం ఆత్మహత్య

రాజమహేంద్రవరం, ఆగస్ట్ 17:  ‌తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని రోడ్డు కమ్‌ ‌రైలు వంతెన పైనుంచి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పిఠాపురానికి చెందిన ఏఈ కుటుంబం గోదావరిలోకి దూకింది. నూకరాజు, ఆయన భార్య, కుమార్తె, మనవడు నీటిలోకి దూకారు. మనవడు ప్రాణాలతో బయటపడగా చికిత్స నిమిత్తం హాస్పిట‌ల్‌కు తరలించారు. మిగతా వారి కోసం పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పిఠాపురంలో పంచాయతీరాజ్‌ ఏఈగా నూకరాజు పనిచేస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.నదిలోకి దూకేముందు నూకరాజు మరణ వాంగ్మూలం రాసి స్నేహితులు, అధికారుల గ్రూప్‌లో పోస్టు చేశారు. కాకినాడ రైఫిల్‌ ‌షూటింగ్‌ ఆర్గనైజర్‌ ‌షేక్‌ ‌సాధిక్‌ ‌ఖాన్‌ ‌వేధింపుల కారణంగానే తమ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లెటర్‌లో పేర్కొన్నారు. తన అల్లుడు ఈ ఏడాది జులైలో మరణించిన తర్వాత కుమార్తెను షేక్‌ ‌సాధిక్‌ ‌ఖాన్‌ ‌వేధిస్తున్నాడని వెల్లడించారు. ఆ వ్యక్తి కారణంగా తన కుమార్తెకు, మనవడికి ప్రాణహాని ఉందని, ఈ కారణంతోనే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలిపారు. కాకినాడ నాగమల్లి తోట జంక్షన్‌ ‌వద్ద ఏఈ కుటుంబం నివాసం ఉంటోంది. కాకినాడ నుంచి రాజమహేంద్రవరానికి ఆదివారం కారులో నూకరాజు కుటుంబం బయలుదేరింది. కొవ్వూరు వంతెన వద్ద డ్రైవర్‌ను దించి నూకరాజు కుటుంబం కారులో వెళ్లింది. రోడ్‌ ‌కమ్‌ ‌రైలు బ్రిడ్జిపై కారు ఆపి వంతెనపై నుంచి నూకరాజు కుటుంబం దూకింది. నీటిలో కొట్టుకు వస్తున్న నూకరాజు మనవడు పదేళ్ల రియాన్ష్ ‌కార్తికేయను జాలర్లు కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారు. గల్లంతైన నూకరాజు(61), భార్య నా(59), కుమార్తె సౌజన్య(34) కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *