మెద‌డు క‌ణితి తొల‌గింపు స‌క్సెస్‌

– మ‌ల‌క్‌పేట కేర్ హాస్పిట‌ల్స్ ఘ‌న‌త‌
– 25 ఏళ్ల యువకుడి ప్రాణాలు కాపాడిన డాక్ట‌ర్లు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 11: మలక్‌పేటలోని కేర్ హాస్పిటల్స్ వైద్య బృందం స‌కాలంలో వైద్యం చేసి ఖమ్మంకు చెందిన 25 ఏళ్ల యువకుడిలో ఉన్న సంక్లిష్టమైన మెదడు కణితిని విజయవంతంగా తొలగించింది. యువకుడు కొద్ది రోజులుగా వేగంగా తగ్గిపోతున్న వినికిడి శక్తి, నడకలో అసమతుల్యత వంటి లక్షణాలతో బాధపడుతున్నాడు. ప్రారంభంలో సాధారణంగా అనిపించిన ఈ సమస్యలు, త్వరగా తీవ్రరూపం దాల్చి అతని ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టాయి. పరీక్షలలో అతనికి అకౌస్టిక్ ష్వాన్నోమా అనే నిరపాయకరమైన కానీ ప్రమాదకర కణితి ఉన్నట్టు తేలింది. ఇది మెదడు కాండానికి దగ్గరగా ఉండడంతో చికిత్స ఆలస్యం అయితే ముఖ పక్షవాతం, శాశ్వత వినికిడి నష్టం, ఇంకా ప్రాణాపాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హై-రిజల్యూషన్ ఎంఆర్ఐ ద్వారా సమస్యను ఖచ్చితంగా గుర్తించిన వైద్య బృందం కుడి రెట్రోమాస్టాయిడ్ సబ్‌ఆక్సిపిటల్ విధానంతో కణితిని పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది. ఈ క్లిష్ట శస్త్రచికిత్సకు సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ భవానీ ప్రసాద్ గంజి నాయకత్వం వహించగా, అనస్థీషియాలజీ & క్రిటికల్ కేర్ హెచ్ఓడి డాక్టర్ ఎం.లక్ష్మీ ప్రశాంత్ కుమార్, ఓటీ, వార్డ్ బృందాలు సహకరించారని వెల్లడించారు. శస్త్రచికిత్స పూర్తిగా విజయవంతమై రోగికి కొత్త నాడీ సంబంధిత లోపాలు ఏవీ రాలేదు. చికిత్స తర్వాత అతను సమతుల్యతను తిరిగి పొందాడు. కేవలం మూడు రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యాడు. డాక్టర్ భవానీప్రసాద్ మాట్లాడుతూ చిన్నగా కనిపించే వినికిడి లోపం లేదా అసమతుల్యత కూడా లోపల పెద్ద సమస్యకు సంకేతం కావచ్చు.. ఈ రోగి సకాలంలో వచ్చాడు.. అందువల్ల కణితిని పూర్తిగా తొలగించి కీలకమైన మెదడు భాగాలను రక్షించగలిగాం అని చెప్పారు. హాస్పిట‌ల్‌ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఎడ్ల మాట్లాడుతూ న్యూరో కేసుల్లో సమయానికి తీసుకునే నిర్ణయమే ప్రాణాలను కాపాడుతుంది.. తమ బృందం వేగవంతమైన నిర్ధారణ, ఆధునిక వైద్యం, సమన్వయంతో పనిచేయడం వలన రోగికి మంచి ఫలితం వచ్చింద అని తెలిపారు. ఈ విజయవంతమైన శస్త్రచికిత్స మలక్‌పేట కేర్ హాస్పిటల్స్‌ను హైదరాబాద్‌లోని ప్రముఖ న్యూరో సర్జరీ కేంద్రాలలో ముందంజలో నిలబెడుతున్నదని హాస్పిట‌ల్‌ ప్రతినిధులు చెప్పారు. సంక్లిష్టమైన మెదడు కణితులతో బాధపడుతున్న రోగులకు ఇది ఆశ కలిగించే పరిణామంగా నిలిచింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page