ఆందోళనకరంగా అమిత్‌ ‌షా తీరు

– ఆయన భాష కూడా సరిగా లేదు
– విపక్ష నేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ విమర్శలు

న్యూదిల్లీ, డిసెంబర్‌ 11: ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభ సమావేశాల్లో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా ఆందోళనకరంగా ఉన్నారని కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ వ్యాఖ్యానించారు. ఆయన భాష కూడా స్పష్టంగా లేదన్నారు. ‘బుధవారం నాటి సమావేశంలో వోటు చోరీ అంశంపై మీడియా ముందు తాను చేసిన వ్యాఖ్యలను పార్లమెంట్‌లో చర్చకు తీసుకురావాలని అమిత్‌ ‌షాకు సవాల్‌ ‌విసిరాను. ఆ సమయంలో ఆయన ఆందోళనకరంగా కనిపించారు. భాష కూడా సరిగ్గా లేదు. చేతులు వణుకుతూ కనిపించాయి. ఏ ప్రశ్నకూ నేరుగా సమాధానం చెప్పలేకపోయారు. ఎలాంటి ఆధారాలూ చూపడం లేదు. మానసికంగా ఒత్తిడికి లోనయ్యారు. మీరూ ఆ విషయాన్ని గమనించే ఉంటారు అని అమిత్‌ ‌షానుద్దేశించి రాహుల్‌ అన్నారు. అయితే రాహుల్‌ ‌వ్యాఖ్యలపై బీజేపీ వర్గాలు స్పందిస్తూ నిన్న చర్చలు జరిగే సమయానికి అమిత్‌ ‌షా అనారోగ్యానికి గురయ్యారని తెలిపాయి. లోక్‌సభలో ప్రసంగించేందుకు లేచి నిల్చున్నప్పుడు ఆయన 102 డిగ్రీల జ్వరంతో ఇబ్బంది పడ్డారని చెప్పాయి. సమావేశం ప్రారంభానికి ముందే ఆయన్ను వైద్యులు పరీక్షించి మందులు ఇచ్చారని పేర్కొన్నాయి. కాగా, ఈ చర్చ సందర్భంగా అమిత్‌ ‌షా సుమారు 90 నిమిషాలపాటు మాట్లాడారు. వోటు చోరీ అంశంపై రాహుల్‌ ‌చేస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీయే వోటు చోరీకి పాల్పడిందని, నాయకత్వ లోపమే ఆ పార్టీ ఎన్నికల్లో పరాజయానికి కారణమని షా విమర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page