కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీళ్ల మళ్లింపుపై విచారణ జరిపించండి

– ఇరిగేషన్ శాఖకు ఎంపీ చామల లేఖ

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కు నీళ్ల మళ్లింపుపై విచారణ జరపాలని భువ నగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గురువారం ఇరిగేషన్ శాఖకు లేఖ రాశా రు. కొండ పోచమ్మ సాగర్ నుంచి ఫామ్ హౌస్ కు నీళ్ల మళ్లింపుపై విచారణ జర పాలని ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీధర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రజల అవసరాల కోసం ఉపయోగించే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను వ్యక్తిగత అవసరాల కోసం ఫామ్ హౌస్ కు వాడుకోవడంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. ప్రాజెక్టు రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలిస్తే ప్రజా ధనం ఎంత దుర్వినియోగం అయిందో లెక్క బయటకు వస్తుందని అన్నారు. కొండ పోచమ్మ సాగర్ నుంచి పాండురంగ చెరువుకు అక్కడి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీళ్ల తరలింపుపై వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *