ఎమ్మెల్సీ పోరుకు బీఆర్ఎస్ సమరశంఖం

– నియోజకవర్గాల వారీగా ఇన్ చార్జిల నియామకం

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : రాష్ట్రంలో త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయే ట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కదనరంగంలోకి దూకింది. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ దళం క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని, వోటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు నియోజక వర్గాల వారీగా ప్రత్యేక ఇన్చార్జిలను నియమిం చింది. గురువారం తెలంగాణ భవన్లో నిర్వ హించిన కీలక సమీక్షా సమావేశం అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మేరకు ఇన్చార్జిల పేర్లను అధికారికంగా ప్రకటించారు.

రెండు కీలక నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి

ఖమ్మం-వరంగల్ నల్గొండ, మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రాముఖ్యత ఉన్న సీనియర్ నాయకులకు బాధ్యతలను అప్పగించారు. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను ఏకం చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఈ ఇన్ చార్జిలకు కేటాయించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని గుర్తించి వోటరుగా నమోదు చేయించే ప్రక్రియను మొదటి ప్రాధాన్యతగా చేపట్టాలని కేటీఆర్ ఇన్చార్జీలను, కేడర్ ను ఆదేశించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *