– లహుజీ సాళ్వెపై పుస్తకం ఆవిష్కరించిన మంత్రి జూపల్లి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : క్రాంతిపిత గురువర్య లహుజీ సాళ్వె పుస్తకాన్ని సెక్రటేరియట్‌లోని తన కార్యాలయంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆవిష్కరించారు. చంద్రకాంత్ వాన్‌ఖేడ్ రచించిన మరాఠీ పుస్తకాన్ని గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ తెలుగులో అనువదించగా తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా ప్రచురించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ వివాహం చేసుకోకుండా జీవితాన్ని దేశం, సమాజ సేవకు అంకితం చేసి వేలాదిమంది స్వాతంత్య్ర పోరాట వీరులను తయారు చేసిన క్రాంతిగురు లహుజీ సాళ్వె అని, అయన మహాత్మా జ్యోతిబా ఫూýకు కూడా గురువు అని తెలిపారు. ఫూలేకు అండగా ఉండి ఆ కాలంలో విద్యా సామాజిక కార్యక్రమాలను విజయవంతం చేయుటలో ప్రముఖ పాత్ర పోషించారన్నారు. లహుజీ సాళ్వె చరిత్ర తెలుగువారికి కూడా అందుబాటులో ఉండాలని ప్రభుత్వం తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా ఈ పుస్తకాన్ని ప్రచురించిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం ద్వారా అయన చరిత్రను, అయన కృషిని తెలుసుకుని వారి ఆశయాలను ముందుకు తీసుకెîళ్ళాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ నామోజు బాలచారి (తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి), జంగిటి వెంకటేష్ (సీనియర్ జర్నలిస్ట్), యు.నాగార్జున, గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్ (రచయిత), సోమశిల తిరుపాల్ (సాహితీవేత్త) పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




తెలంగాణపై తప్పుడు వ్యాఖ్యలు తగవు