– దక్షిణాది గొంతు నొక్కే పన్నాగం పటాపంచలు!
– 1 సీట్ల పెంపు కుట్రపై ప్రజాస్వామ్య విజయం..
– లోక్సభలో చతికిలపడ్డ కేంద్రం!
(వెంక గారి భూమయ్య, సీనియర్ జర్నలిస్ట్)
భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో అహంకారానికి, రాజ్యాంగ ధిక్కారానికి లభిం చిన గట్టి చెంపదెబ్బ ఇది. జనాభా ప్రాతిప దికన లోక్సభ స్థానాలను ఏకంగా 850కి పెంచి, దేశ రాజకీయ ముఖచిత్రాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న కేంద్ర ప్రభు త్వ దుష్ట సంకల్పం లోక్సభ సాక్షిగా కుప్పకూ లింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగి పోవడం అనేది కేవలం ఒక సాంకేతిక ఓటమి మాత్రమే కాదు; సమాఖ్య స్ఫూర్తిని స్మశానవా టికకు పంపాలని చూసిన పాలకుల కుట్రపై ప్రజాస్వామ్యం సాధించిన అఖండ విజయం. 278 ఓట్లతో ప్రభుత్వం ఆధిక్యంలో ఉన్నట్లు భ్రమపడినా, రాజ్యాంగ సవరణకు అవసరమై న 326 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ను అందుకోలేక ఢిల్లీ పీఠం చతికిలపడటం పాలకుల వ్యూ హాత్మక దివాళాకోరుతనానికి నిదర్శనం. సభలో ఉన్న 489 మంది సభ్యుల్లో మూడింట రెండు వంతుల మద్దతు కూడగట్టలేకపోవడం. అంటే, దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే అంశంపై ప్రభుత్వం ఎంతటి అపరిపక్వతతో, ఎంతటి మొండితనంతో వ్యవహరించిందో అర్థమవుతోంది.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు వెనుక అ త్యంత హేయమైన రాజకీయ కుట్ర దాగి ఉం ది. దశాబ్దాలుగా జనాభాను నియంత్రి స్తూ, క్రమశిక్షణతో అభివృద్ధి చెందుతున్న దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాబల్యాన్ని తుడిచిపెట్టడ మే ఈ పన్నాగం అసలు ఉద్దేశం. ఉత్తరాదిలో ఓట్ల వేట కోసం జనాభా విస్ఫోట నాన్ని వరం గా మార్చుకుని, దేశాన్ని భౌగోళి కంగా రెం డుగా విభజించాలనే పాలకుల వి కృత చేష్టల కు పార్లమెంటు అడ్డుకట్ట వేసింది. అభివృద్ధిని శిక్షించి, అరాచక పెరుగుదలకు పట్టం కట్టే ఈ ప్రతిపాదన దేశ సమగ్రతకు గొడ్డలిపెట్టు వంటిది. ఢిల్లీ గద్దెపై కూర్చున్న పాల కులు తామేదో సర్వాధికారులమని, రాష్ట్రాలను తమ సామంత రాజ్యాలుగా మార్చుకోవచ్చని భావించడం వారి అజ్ఞానానికి పరాకాష్ట. జనాభా పెరిగితే సీట్లు పెరుగుతాయన్న సూత్రం, నిజా నికి దేశాభివృద్ధికి సహకరించిన రాష్ట్రాలను రాజకీయంగా నిర్వీర్యం చేయడమే అవు తుంది. ఈ వివక్షా పూరిత వైఖరిని పసిగట్టిన విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి కేంద్రం పన్నా గాలను చిత్తు చేశాయి. పార్లమెంటరీ వ్యవస్థలో ఏదైనా ఒక రాజ్యాంగ సవరణ తీసుకువచ్చేటప్పుడు అన్ని పక్షాలను కలుపుకొని పోవడం, ఏకాభిప్రాయం సాధిం చడం కనీస ధర్మం. కానీ, ప్రస్తుత ప్రభుత్వం మదగజంలా వ్యవహరిస్తూ, ప్రతిపక్షాల గొంతు నొక్కి, ఏకపక్షంగా రాజ్యాంగాన్ని తమ ఇంటి పత్రంలా మార్చుకోవాలని చూసింది. ఎలక్ట్రానిక్ ఓటిం గ్లో బయటపడిన గణాం కాలు ప్రభుత్వ అస మర్థతను, పార్లమెంటరీ ప్రక్రియపై వారికి ఉన్న లక్ష్యశుద్ధి లేమిని ఎండగట్టాయి. ఓటిం గ్రీకు అవసరమైన 326 ఓట్లు లేవని తెలిసి కూడా బిల్లును నెట్టాలని చూ డటం అంటే, చట్టసభను ప్రభుత్వం ఒక రబ్బరు స్టాంపులా భావిస్తోందని స్పష్టమవుతోంది. 211 మంది సభ్యులు ఈ బిల్లును వ్యతిరేకించారంటే, అది కేవలం రాజకీయ వ్యతిరేకత కాదు: దేశ భౌగోళిక, రాజకీయ సమతుల్యతను తలకిం దులు చేయవద్దని ఇచ్చిన గంభీర హెచ్చరిక. ఈ పరాభవం తర్వాతైనా కేంద్రం తన మొండి వైఖరిని, నిరంకుశ పోకడలను వీడాలి. 850 సీట్లకు పెంచి కొత్త పార్లమెంటు భవనంలో తమ బానిసలను నింపుకోవాలనుకున్న పాల కులకు, ప్రజాస్వామ్య వ్యవస్థ గట్టి ముచ్చెమట లు పట్టించింది. నియోజకవర్గాల పునర్విభజ న అనేది కేవలం అంకెల గారడీ కాదు. అది దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన సున్ని తమైన అంశం. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనా లను పణంగా పెట్టి. కేవలం ఓట్ల రాజకీయాల కోసం దేశ పునాదులను కదిలించే సాహసం చేస్తే ఫలితం ఇలాగే అవమానకరంగా ఉం టుందని తేలిపో యింది. అంకెల గారడీతో అధికారాన్ని శాశ్వతం చేసుకోవచ్చనే భ్రమ లో ఉన్న పాలకులకు, ఈ ఓటింగ్ ఫలితం ఒ క మరణశాసనం. విపక్షాలు చూపిన ఈ ఐకృత ప్రజాస్వామ్యానికి ఒక రక్షణ కవచం లా నిలిచింది. సంఖ్యాబలం అనేది అహంకా రానికి చిహ్నం కాకూడదని, అది బాధ్యతా యుతమైన పాలనకు పునాది కావాలని ఈ పరిణామం గుర్తు చేస్తోంది.
నిజానికి పరిపాలనా సంస్కరణలపై ప్రభుత్వా నికి చిత్తశుద్ధి ఉంటే, చీకటి గదుల్లో కుట్రలు చేయడం మానేసి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో,
మేధావులతో ముఖాముఖి చర్చలు జరపాలి. ఏ ప్రాతిపదికన సీట్లను పెంచుతున్నారో, దాని వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందో సమాధానం చెప్పలేని పిరికితనం ప్రభుత్వా నిది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పతనం భారత ప్రజాస్వామ్యం ఇంకా సజీవంగా ఉందనదానికి, రాజ్యాంగం ఇంకా నియంతల చేతుల్లో బందీ కాలేదనడానికి సజీవ సాక్ష్యం. సం ఖ్యాబలం ఉందన్న అహంకారంతో రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కాలని చూస్తే, పార్లమెంటు గోడలే పాలకులను బహిష్కరిస్తాయని ఈ రోజు రుజువైంది. ప్రజల గొంతును నొ క్కే ప్రయత్నం చేస్తే ఫలితం ఇలాగే ఉంటుం దని ఈ ఓటింగ్ ఫలితం తేల్చిచెప్పింది. సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా తమ రాజకీయ లబ్దిని వెతుక్కునే ప్రయత్నంలో, ప్రభుత్వం దేశ పునాదులను కదిలించే సాహసం చేస్తోంది. అధికారం అనేది శాశ్వతం కాదు, కానీ మీరు చేసే ద్రోహం చరిత్రలో శాశ్వతంగా ఉండిపో తుంది. సీట్ల పెంపు పేరుతో మీరు ఆడిన ఈ అపవిత్ర క్రీడలో ప్రజాస్వామ్యమే విజేతగా నిలిచింది. ఈ ఓటమి పాలకులకు ఒక నిరం తర పీడకలగా మిగిలిపోవాలి. ఇప్పటికైనా వినాశకరమైన ఆలోచనలను విడనాడి, దేశ సమైక్యతను గౌరవించకపోతే, రాబోయే రోజు ల్లో ప్రజలు మిమ్మల్ని చరిత్ర పుటల నుంచి తుడిచిపెట్టడం ఖాయం. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం అనేది భారత ప్రజాస్వామ్యం ఇంకా సజీవంగా ఉందన దానికి నిదర్శనం. ఇది కేవలం ఒక బిల్లు ఓట మి కాదు. ప్రజాస్వామ్య పీఠంపై పడగనీడలా మారిన నిరంకుశత్వానికి అంత్యక్రియల ప్రా రంభం. పాలకుల తీరు మారుతుందో లేదో కాలమే నిర్ణయించాలి. కానీ ప్రజలు మాత్రం. అప్రమత్తంగా ఉండాలి.





