– ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్రలు: జగ్గారెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11: బీజేపీ నీచ రాజకీయం పరాకాష్టకు చేరిందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ విలువలను వదిలేసి దిగజారుడు రాజకీయాలకు పాల్పడున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణే దీనికి తాజా ఉదాహరణ అని అన్నారు. ఈ అప్రజాస్వామిక చర్యలను దేశ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, బీజేపీ చేస్తున్న ఈ అన్యాయపు రాజకీయాలకు కాలమే సమాధానం చెబుతుందని అన్నారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను అత్యంత అన్యాయంగా, నిబంధనలకు విరుద్ధంగా తిరస్కరించారని ఆయన ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో ఉన్న అసెంబ్లీ సంఖ్యాబలం ప్రకారం బీజేపీకి దక్కేది రెండు రాజ్యసభ సీట్లు మాత్రమేనని, కానీ ఎలాగైనా సరే కాంగ్రెస్‌కు దక్కాల్సిన రాజ్యసభ సీటును లాక్కోవాలనే కుట్రతోనే కావాలని మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో గెలవలేక ఇలాంటి దొడ్డిదారి రాజకీయాలతో ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



