-ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
హన్మకొండ,ప్రజాతంత్ర,జూన్ 11: ఏకాంతంగా ఉన్న లవర్సే వారి టార్గెట్. ఎక్కడైనా ఒంటరిగా ప్రేమ జంట కనిపిస్తే చాలు దోపిడీలకు పాల్పడుతుంటారు. ప్రేమ జంటలను బెదిరించి దోపిడీకి పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కాజీపేటకు చెందిన బౌరి పవన్ సింగ్, రవీందర్ సింగ్, సికిందర్ సింగ్ ముగ్గురు కలిసి ఈ నెల 7న ఉర్సు గుట్ట ప్రాంతంలో ఓ యువతి, యువకుడు బైక్‌పై వెళ్లడాన్ని గమనించారు. వారు ఏకాంతంగా గడుపుతుండగా సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసి డబ్బులు ఇవ్వకుంటే తల్లిదండ్రులకు చెబుతామని బెదిరించారు. తమ దగ్గర డబ్బులు లేవని బతిమాలిన వినకుండా సదరు జంటపై దాడికి పాల్పడి చేతికి ఉన్న బంగారు ఉంగరాలు, గొలుసులు లాక్కున్నారు. యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. కాగా, వారి వద్ద దోచుకున్న సొత్తును విక్రయించేందుకు వరంగల్ వెళ్లగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు ఉంగరం, గొలుసులు, మూడు సెల్‌ఫోన్స్, బైక్‌ను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ స్వామి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

