ఉద్యోగస్తులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

– మహనీయుల ఆలోచన మేరకు ముందుకెళ్లాలి
– ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో మీదే కీలక పాత్ర
– సచివాలయంలో అంబేడ్క‌ర్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తా
– మహనీయుల జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : శక్తి ఉన్నన్ని రోజులు అణగారినవర్గాల అభ్యున్నతి కోసం, ఉద్యోగుల సంక్షేమ కోసం నిరంతరం పాటుపడతానని గిరిజన, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. అంబేడŠ్కర్ సూచించిన విధంగా కేవలం చదువు ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకెళ్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలో అంబేడ్కర్ నాలెడ్జి సెంటర్, నింబోలి అడ్డలో ఒక లైబ్రరీ, హాస్టల్ ఏర్పాటుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారని గుర్తు చేశారు. మహనీయులు చూపిన మార్గంలో ఉద్యోగస్తులందరూ నడవాలని, తద్వారా ఆయా వర్గాలకు మేలు కలిగే విధంగా ప్రభుత్వం నిర్దేశించిన పథకాలను క్షేత్రస్థాయిలో అందేలా ఉద్యోగస్తులదేనని, అందుకు అనుగుణంగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. మనందరం ఒక గొప్ప సందర్భంలో కలుసుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ ఏప్రిల్ మాసం దేశ చరిత్రలో ఒక విశిష్టమైన నెల అని, ఎందుకంటే ఈ నెలలోనే బాబూ జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, జ్యోతిబా పూలే వంటి గొప్ప మహానుభావులు జన్మించారని తెలిపారు. వీరు వ్యక్తులు మాత్రమే కాదు.. ఒక ఆలోచన, ఒక ఉద్యమం, ఒక సమానత్వ దార్శనికత అని తెలిపారు. ఈ దేశానికి వారు చేసిన సేవలు అపారమైనవని అన్నారు. సామాజిక న్యాయం, సమాన హక్కులు, విద్యా ప్రాధాన్యత వంటి విలువలను మనకు అందించారని తెలిపారు. సచివాలయంలో పనిచేస్తున్న 320మంది ఎస్సీ, ఎస్టీ ఉద్యోగస్తులు కూడా వారి ఆలోచనలను ఆచరణలో పెట్టే బాధ్యతను మోస్తున్నారన్నారు. మనం ఉద్యోగులం మాత్రమే కాదు.. ప్రజలకు సేవ చేసే ప్రతినిధులు అని వ్యాఖ్యానించారు.వ Tహనీయులు సూచించిన మార్గంలో ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలు, ఆరోగ్య సదుపాయాలు, ఉద్యోగ భద్రత, పెన్షన్ విధానాలు.. ఇవన్నీ ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయన్నారు. మన పనితీరు ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడం కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా సచివాలయంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రిని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి అడ్లూరి ముఖ్యమంత్రితో సంప్రదించి విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రశాంత్, సలహాదారులు సైదా, ఉద్యోగుల సహకార సంఘం అధ్యక్షుడు రెడ్ల రాజేశ్వర్, సునీత అడిషనల్ సెక్రటరీ, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *