డివైడర్‌ను ఢీకొన్న బైక్

– కాళీ మందిర్ వద్ద ప్రమాదం.. విద్యార్థి మృతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాళీ మందిర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బీటెక్ విద్యార్థి డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని 23 ఏళ్ల వికాస్‌గా గుర్తించారు. ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వికాస్ ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం ఎలా జరిగింది.. వాహనం అదుపుతప్పడానికి కారణమేంటి.. రహదారి పరిస్థితులు, వేగం తదితర అంశాలు ప్రమాదానికి దారితీశాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *