– రూ.13,041 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులకు ఆమోదం
– కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
న్యూదిల్లీ, ఆగస్ట్19 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకున్నది. దేశంలో రైలు, రహదారి మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేలా మొత్తం రూ.13,041 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో నాలుగు రైల్వే బహుళ మార్గాల ప్రాజెక్టులు కాగా, మరొకటి బిహార్‌లో రహదారి ప్రాజెక్టు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన నాలుగు రైల్వే ప్రాజెక్టుల మొత్తం వ్యయం సుమారు రూ.9,450 కోట్లు. ఇవి నాలుగు రాష్ట్రాల్లో రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు రద్దీని తగ్గించేందుకు ఉద్దేశించినవి. ముఖ్యంగా గూడూరు-గుమ్మిడిపుండి 3, 4వ లైన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.2,229 కోట్లతో గూడూరు-గుమ్మిడిపుండి 3, 4వ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఖరగ్‌పూర్-భద్రక్ 4వ లైన్‌కు రూ.3,352 కోట్లు, భద్రక్-హరిదాస్‌పూర్ 4వ లైన్‌కు రూ.1,583 కోట్లు, కటక్-పారాదీప్ 3, 4వ లైన్లకు రూ.2,286 కోట్లు కేటాయించారు. రైల్వే ప్రాజెక్టులు పూర్తయితే సరుకు రవాణా సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. మొత్తం ద సుమారు 1.3 కోట్ల టన్నుల అదనపు సరకు రవాణా సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రయాణికుల రైళ్ల రాకపోకలు కూడా మరింత సులభతరం కానున్నాయి. అలాగే బిహార్‌లోని ముజఫర్‌పూర్-సీతామర్హి-సోన్
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




