థియేటర్‌ ‌స్క్రీన్స్ ఆధారంగా టికెట్‌ ధ‌ర‌లు

– సినిమా టిక్కెట్లపై ప్రభుత్వం కీలక ఆదేశాలు
– ఐదు షోలకు అనుమతి.. ఆదాయంలో కార్మికులకు వాటా

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్19 :  తెలంగాణలో సినిమా టికెట్‌ ‌రేట్లపై ప్రభుత్వం కీలక జీవో జారీ చేసింది. కొత్తగా స్పెషల్‌ ‌థియేటర్స్ ‌కేటగిరీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 7.1 సౌండ్‌, 2‌కె/4కె స్క్రీన్లకు స్పెషల్‌ ‌కేటగిరీ వర్తించనుంది. ప్రతి థియేటర్‌లో 25 శాతం నాన్‌-‌ప్రీమియం సీట్లు ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం 8 నుంచి రాత్రి ఒంటిగంట వరకు 5 షోలకు అనుమతి ఇచ్చింది. చిన్న సినిమాలకు ప్రతి రోజు ఒక షో తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. రూ.100 కోట్లు పైబడిన సినిమాలకు ప్రభుత్వం సూపర్‌ ‌హై బడ్జెట్‌ ‌హోదా కల్పించింది. తొలి 10 రోజులు టికెట్‌ ‌ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది. టికెట్‌ ‌ధరల పెంపు ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత శాతాన్ని కార్మికుల సంక్షేమ నిధికి విరాళంగా ఇవ్వాలని షరతు పెట్టింది. కార్మికుల సంక్షేమ నిధికి రూ.కోటి వరకు విరాళం తప్పనిసరి చేసింది.

———————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *