హైకోర్టును ఆశ్రయించిన భగీరథ్

– 14న విచారించనున్న వెకేషన్ బెంచ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే1 2: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టుకు వేసవి సెలవులు కావడంతో వెకేషన్ బెంచ్‌లో పిటిషన్ వేశారు. పిటిషన్‌పై ఈనెల 14న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపే అవకాశం ఉంది. కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల‌ మేరకు భగీరథ్ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేస్తూ డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు సున్నితమైనది కావడంతో మహిళా ఐపీఎస్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించాలని డీజీపీ నిర్ణయించారు. ఇప్పటికే బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ‘సిట్’ ఏర్పాటు నేపథ్యంలో మరోసారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసే అవకాశం ఉంది. మరోవైపు భగీరథ్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని, నేరం రుజువైతే నిందితుడిని కచ్చితంగా అరెస్టు చేస్తామని కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *