– ఆయనను రక్షించాల్సిన అవసరం మాకు లేదు
– మీడియాతో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : పోక్సో కేసులో ఆరోపణలు రాగానే అరెస్టు చేయాలని.. చట్టం ప్రకారం నడుచుకోకపోతే ఇబ్బందులు తప్పవని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం ఇక్కడ మీడియాతో చిట్‌చాట్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ను తప్పకుండా అరెస్టు చేస్తారని తెలిపారు. భగీరథ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిఖార్సైన కాంగ్రెస్ లీడర్ అని చెప్ప్పుకొచ్చారు. ఈ కేసులో ఎలాంటి జాప్యం లేదని వెల్లడించారు. పోక్సో చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. భగీరథ్‌ను తప్పించే అవసరం తమకు లేదన్నారు. భగీరథ్ విదేశాలకు వెళ్లారని అనుకోవడం లేదన్నారు. మోదీని ప్రధాన మంత్రిగా మాత్రమే చూస్తామని పీసీసీ చీఫ్ అన్నారు. ప్రధాని మోదీ ఏదో ఇస్తారని అనుకుంటే ఏవిÖ ఇవ్వలేదని విమర్శించారు. బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ కంటే బీజేపీలో ఎక్కువ గ్రూపు తగాదాలు ఉన్నాయన్నారు. భగీరథ్ కేసులో బాధితురాలికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ వెనుకంజ వేయదని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో విజయలక్క్ష్మికి మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చామని తెలిపారు. ఎవరికి వారు తెలంగాణ జాతిపిత అనుకుంటే ఎలా.. జాతిపిత అనే బిరుదు ప్రజలు ఇవ్వాలి అని అన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నారని, కవిత, కేటీఆర్ తర్వాత వచ్చారని తెలిపారు. తెలంగాణలోనూ ‘సర’తో అక్రమాలు చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. ఎవరి ఓటును వాళ్లు కాపాడుకోవాలని సూచించారు. మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కు పరిమితమై వ్యక్తిగత జీవితానికి అలవాటు పడ్డారన్నారు. రాష్ట్రంలో గతం కంటే ఈసారి ఎక్కువగా పంట దిగుబడి వచ్చిందని, ధాన్యం కొనుగోలు జరుగుతోందని, ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. గత ప్రభుత్వం చేస్తున్న అప్ప్పులు తీరుస్తూనే అభివృద్ధి చేస్తున్నామన్నారు. బెంగాల్‌లో బీజేపీ ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేదని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



