– గచ్చిబౌలి పీజీలో ఘటన
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : గచ్చిబౌలిలో తీరని విషాదం చోటుచేసుకుంది. లిఫ్టులో ఇరుక్కుని మరో చిన్నారి మృత్యువాత పడింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక కుటుంబం ఉపాధి కోసం నగరానికి వలస వచ్చి గౌలిదొడ్డిలోని మహి ఉమెన్స్ పీజీ హాస్టల్‌లో వంట పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆ కుటుంబానికి చెందిన ఐదేళ్ల చిన్నారి బిస్తూ గోష్ స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. బుధవారం ప్రమాదవశాత్తు అపార్ట్‌మెంట్‌లోని లిప్ట్‌లో ఆ చిన్నారి గ్రౌండ్ ప్లోర్ నుండి ఐదో అంతస్తుకు వెళ్తున్న క్రమంలో మÖడవ అంతస్తు వద్ద చిన్నారి జుట్టు లిప్ట్ డోర్లలో ఇరుక్కుపోయింది. అది గమనించేలోపే లిప్ట్ కదలడంతో చిన్నారి తల నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. స్థానికులు డయల్ 100కు కాల్ చేయగా పోలీసులు, హైడ్రా, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. లిప్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి మృతదేహాన్ని అత్యంత శ్రమతో బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. చిన్నారి కళ్లముందే విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




